రాబోయే 24 గంటల్లో వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశం , తూర్పు భారతదేశం రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం అంచనా వేసింది.బులెటిన్ ప్రకారం, మే 28-29 తేదీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
రాబోయే 24 గంటల్లో విదర్భపై చాలా చోట్ల వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ ఏజెన్సీ అంచనా వేసింది. హర్యానా, చండీగడ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో కొన్ని ప్రదేశాలు, పంజాబ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లలో వేడిగాలులు ప్రభావం ఉండనుంది. రాబోయే 2-3 రోజులలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, మరాఠ్వాడ మరియు మధ్య మహారాష్ట్రలలో కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని ఐఎండి తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: WEATHER