హైదరాబాద్ లో ఈ రోజు గరిష్ట వాతావరణం 39 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట వాతావరణం 27 డిగ్రీలుగా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే బంగాళా ఖాతంలో తీరం దాటిన అంఫన్ తుపాను ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పలు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకూ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: WEATHER