Home /News /telangana /

Weather Report: నేటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే...

Weather Report: నేటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది.

    ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 10 గంటల నుంచే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు లాక్‌డౌన్‌, మరోవైపు మండే ఎండల ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే అటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే 24 గంటల్లో ఆగ్రేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: WEATHER

    తదుపరి వార్తలు