Home /News /telangana /

WEATHER REPORT TODAY IN TELANGANA AND HYDERABAD HERE ARE THE DETAILS MAY 10 MK

Weather Report: మండుతున్న భానుడు...ఉత్తర తెలంగాణలో వడగళ్లు పడే చాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాతావరణం మార్పు ప్రభావంతో శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

    తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు చోట్ల మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. వాతావరణం మరో రెండు రోజులు ఇలాగే ఉండే అవకాశం వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వాతావరణం మార్పు ప్రభావంతో శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణలో వడగళ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈరోజు హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ 69 శాతం ఉండే వీలుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు