హోమ్ /వార్తలు /తెలంగాణ /

Weather Update: ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది అంటే...జూన్ 6

Weather Update: ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది అంటే...జూన్ 6

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం క్రమంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

  రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చాలా చోట్ల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం క్రమంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు జూన్ 10 వరకు మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైక్లోనిక్ ప్రసరణ కనిపిస్తుంది. బంగాళా ఖాతం నుం,ి వచ్చే తేమ ఛత్తీస్‌గడ్ కు టర్ఫ్ లైన్ ఏర్పడటం వల్ల, ఏపీలో ప్రస్తుతం తుఫాను వర్షం కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాబోయే జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కంటే మెరుగైన వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. వర్షపాతం జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం ఉండే అవకాశం ఉందని తేలింది. బుధవారం నుంచి గ్రేటర్ హైదరబాద్ సహా పరిసర ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. దీంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం ఒకటి లేదా రెండుసార్లు సంభవిస్తుందని వాతావరణ సూచన పేర్కొంది. ఇక జూన్ 6 న పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. జూన్ 7-8 తేదీలలో ఆకాశం స్పష్టంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదు అయ్యింది. పగటి ఉష్ణోగ్రతల్లో భారీగా క్షీణత నమోదు అయ్యింది.

  వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, జూన్ 3 నుంచి తెలంగాణలోని దక్షిణ, ఈశాన్య భాగాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే జూన్ 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు ఉరుములతో కూడిన వర్షం కురుస్తాయని అంచనా వేసింది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: WEATHER

  ఉత్తమ కథలు