హోమ్ /వార్తలు /తెలంగాణ /

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత...మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత...మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...

ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ లో నిన్నటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది.

    దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండల నుంచి బయటపడ్డారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ లో నిన్నటి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది.

    మరోవైపు ఏపీలో వచ్చే రెండు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు అల్లకల్లోలంగా తీర ప్రాంతం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడనున్నది. అల్పపీడనం, నైరుతి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

    First published:

    Tags: Andhra Pradesh, Telangana, WEATHER

    ఉత్తమ కథలు