Telangana Weather: తెలంగాణకు మళ్లీ వర్షసూచన.. ఎన్ని రోజులంటే..

ప్రతీకాత్మక చిత్రం

Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Share this:
    Rains in Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయూవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వివరించిన వాతావరణ శాఖ.. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

    ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: