Telangana Weather: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో..

ప్రతీకాత్మక చిత్రం

Rain Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Share this:
    Rains in Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నైరుతి జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 కిమీమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

    ఈ జిల్లాల్లో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: