Home /News /telangana /

WEATHER IN HYDERABAD AND FORECAST FOR TODAY TOMORROW MK

Weather in Hyderabad: భాగ్యనగరంలో భానుడి భగభగలు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత తక్కువగానే కనిపిస్తుంది.

    హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజుకు సగటున 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత తక్కువగానే కనిపిస్తుంది. మే నెల మొదటి రోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు దంచికొట్టాయి. శుక్రవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 30 శాతంగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు