ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న పవనాల వల్ల ఏర్పడిన కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్లో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. నగరంలో 1.4సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత 29.0డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 95శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad Rains, WEATHER