నేతలకు షాక్... వైద్యురాలి హత్యపై స్థానికుల కొత్త నిరసన

Telangana : షాద్‌నగర్ పశువైద్యురాలి హత్యపై ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. న్యాయం జరిగేవరకూ పోరాడతామంటూ స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 12:09 PM IST
నేతలకు షాక్... వైద్యురాలి హత్యపై స్థానికుల కొత్త నిరసన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana : తెలంగాణ నిర్భయ హత్యాచారం కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలి ఇంటికి రాజకీయ నేతలు, కొందరు ప్రముఖులు వెళ్లి ఓదార్చుతున్నారు. నిర్భయ తల్లిదండ్రుల్ని పరామర్శిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని సహా చాలా మంది అధికారులు, నేతలు పరామర్శించారు. అయితే తాజాగా తమ దగ్గరకు ఎవరూ రావొద్దంటూ బాధితులు ఇంటికి తాళం వేసుకున్నారు. తమకు పరామర్శలు వద్దనీ... తమ బతుకు తాము బతకనివ్వమని కోరుకుంటున్నారు. ఎవరూ రావద్దంటూ ఉదయం ఇంటికి బోర్డును తగిలించి, ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నారు. తమ బిడ్డను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, తమకు న్యాయం కావాలనీ, పరామర్శలు వద్దని వారు అంటున్నారు.

మరోవైపు శంషాబాద్‌లో తెలంగాణ నిర్భయ ఘటనపై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు ఉంటున్న గేటెడ్‌ కమ్యూనిటీ నక్షత్ర విల్లా దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎంట్రీ దగ్గర కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, నేతలు అటువైపు రావద్దని బోర్డులు పెట్టారు. విల్లాలో ఉన్న పోలీసుల్ని బయటకు పంపేశారు. కాలనీ మహిళలు అక్కడే ఉండి... స్థానికుల్ని మాత్రమే లోపలికి రానిస్తున్నారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఇంకా స్పందించకపోవడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. ఐతే... ఇలా గేటు మూసేయడంతో... అక్కడకు వస్తున్న పోలీసులు, నేతలు... సైలెంట్‌గా వెనక్కి వెళ్లిపోతున్నారు. సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలకు ఇవాళ నిరాశే ఎదురైంది. స్థానిక మహిళలు వారిని గేటు బయటి నుంచే పంపేశారు.

 

తమిళంలో దుమ్మురేపుతున్న వరంగల్ బ్యూటీ ఆనందీ


ఇవి కూడా చదవండి :

తీవ్ర విషాదం... రైలు పట్టాలపై తల్లీ, కూతుళ్ల ఆత్మహత్యభార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... ఫ్యాన్స్ గ్రీటింగ్స్

సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లు

Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>