• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • WE HAVE DONE NOTHING WRONG SAYS TELANGANA INTER BOARD TECHNOLOGY SUPPORTER GLOBARENA BA

Exclusive: ఇంటర్ బోర్డు వివాదంలో గ్లోబరీనా.. అసలు ఈ సంస్థకు టెండర్ ఎలా దక్కింది?

Exclusive: ఇంటర్ బోర్డు వివాదంలో గ్లోబరీనా.. అసలు ఈ సంస్థకు టెండర్ ఎలా దక్కింది?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు, గ్లోబరీనా టెక్నాలజీస్

ఇంటర్ బోర్డు సూచించిన నిబంధనల ప్రకారమే తాము ప్రాసెస్ చేశామని, అందులో తమ తప్పేమీ లేదని గ్లోబరీనా సంస్థ సీవీవో ఎస్ వీ ఎస్ రాజు న్యూస్ 18తెలుగుకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలిపారు.

 • Share this:
  తెలంగాణలో ఇంటర్ బోర్డు ఫలితాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఇంటర్ బోర్డుకి సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. పలు ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో గ్లోబరీనా సంస్థతో న్యూస్‌18 ప్రత్యేకంగా మాట్లాడింది. గ్లోబరీనా టెక్నాల‌జీస్ సీఈవో ఎస్ వీ ఎస్ రాజు న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘మా సంస్థ‌కు అనుభవం లేద‌న‌డం అవాస్తవం. గ‌డిచిన 18 ఏళ్లుగా మా సంస్థ వివిధ ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థ‌ల‌కు సేవలు అందిస్తోంది. అస‌లు జ‌రుగుతున్న వివాదంలో వాస్త‌వాలు ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. అన‌వ‌స‌ర ప్ర‌చారాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. విద్యార్ధులు ఫెయిల్ అవ్వ‌డం అనేది స‌హ‌జం. అయితే ఇక్క‌డ ఇంత రాద్ధాంతం ఎందుకు జ‌రుగుతుందో తెలియ‌టం లేదు. మేము ఇంట‌ర్ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఫ‌లితాలు ప్రాసెస్ చేశాం. ప్ర‌భుత్వం దీనిపై విచార‌ణ‌కు ఆదేశించిన నేప‌థ్యంలో ఇంత మించి ఏం మాట్లాడ‌లేను.’ అని ఎస్వీఎస్ రాజు తెలిపారు.

  టాపర్‌కు సున్నా మార్కులు ఎలా వ‌చ్చాయి?
  కొంత మందికి సున్నా మార్కులు వ‌చ్చిన‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది. ఇది ఎలా జ‌రిగింద‌నే దానిపై మా సంస్థ అంత‌ర్గ‌త విచార‌ణ‌కు ఆదేశించాం. త‌ప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. వాస్త‌వానికి ఇంట‌ర్ బోర్డు మాకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్ర‌కార‌మే మేం ప‌నిచేశాం. ఇందులో మేం ప్ర‌త్యేకంగా చేయ‌డానికి ఏమీ ఉండ‌దు.

  మీ వద్ద Errorsను గుర్తించే సాప్ట్ వేర్ లేదా?
  ఫ‌లితాలు ప్రాసెస్ చేసిన త‌రువాత ఏమైనా Errors ఉంటే గుర్తించే సాఫ్ట్ వేర్ ఉంది. అయినా కొంత మంది విద్యార్థుల‌కు మార్కులు త‌క్కువ ప‌డ్డాయ‌ని మీడియా ద్వారా మా దృష్ఠికి వ‌చ్చింది. జ‌రిగిన త‌ప్పిదంపై విచారణ చేస్తున్నాం. మాకు తెలిసి మేం ఏ త‌ప్పూ చేయ‌లేదు.

  ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల‌కు ఎందుకు ఈ స‌మ‌స్య‌లు లేవు?
  అదంతా మీ అపోహ. అస‌లు ఎవ‌రికీ స‌మ‌స్య లేద‌ని మా అభిప్రాయం. మేము ప్రైవేట్ కాలేజీ సంస్థ‌ల‌తో కుమ్మ‌క్కు అయిపోయాం అని వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌భుత్వం దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించింది. మేం తప్పు చేస్తే విచారణలో తేలుతుంది. మా సంస్థ‌కు టెండ‌ర్ రావ‌డానికి రాజ‌కీయ ఒత్తిళ్లు లేవు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే టెండ‌ర్ వేశాం. అంద‌రికంటే త‌క్కువ బిడ్ వేయ‌డం వ‌ల్లే మాకు టెండ‌ర్ ద‌క్కింది. అంతే కాని ఇందులో ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లు లేవు. మా త‌ప్పు లేదు. అన్నీ నిబంధ‌న‌లు పాటించాం. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్స్ అడిగినా అందిస్తాం.

  (ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  గ్లోబరీనా సంస్థ సీఈవో రాజుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
  First published:

  అగ్ర కథనాలు