WE DID NOT GIVE PERMISSION TO ONLINE CLASSES SAYS TELANGANA GOVT IN HIGHCOURT SK
ఆన్లైన్ క్లాసులకు అనుమతివ్వలేదు.. హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
ప్రతీకాత్మక చిత్రం
Telangana High Court | ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌కు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వనప్పుడు.. ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాస్‌ల నిర్వహణపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు ఏజీ. ఐతే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా.. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులను ఎలా నిర్వహిస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌కు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వనప్పుడు.. ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం కొన్ని స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయని ఏజీ తెలిపారు.
ఐతే ప్రభుత్వం చెపుతున్న అంశాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్‌లపై ప్రభుత్వ పాలసీ విధానం వారం రోజుల్లో చెపుతామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జులై 31 వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాదని కోర్టుకు తెలిపింది. వచ్చే సోమవారం ఆన్లైన్ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.