'మేమేం చేయలేం'...ఇంటర్ ఫలితాల తప్పిదాలపై హైకోర్టు వ్యాఖ్యలు

బాధ్యులపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వమే శాఖాపరమైన విచారణచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

news18-telugu
Updated: June 19, 2019, 6:42 PM IST
'మేమేం చేయలేం'...ఇంటర్ ఫలితాల తప్పిదాలపై హైకోర్టు వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టు (File)
  • Share this:
ఇంటర్ ఫలితాల తప్పిదాలపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. కొందరు విద్యార్థులు ఫెయిల్ కావడం, మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లడంతో తమకు న్యాయం జరుగుతుందని... ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు భావించారు. కానీ బుధవారం ఇంటర్ ఫలితాల దాఖలైన పిటిషన్ల విచారణను ముగించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫలితాల్లో తప్పులు జరగడం వాస్తవమేనని.. ఐతే ఈ విషయంలో తామెలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.


ఇంటర్ ఫలితాల రీ-వెరిఫికేషన్‌లో 0.16% మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్న ధర్మాసనం..పరిహారం చెల్లించాల్సిందిగా తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. బాధ్యులపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వమే శాఖాపరమైన విచారణచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐతే కోర్టు తీర్పుపై ఇంటర్ ఫలితాల్లో నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? అన్ని ప్రశ్నిస్తున్నారు.First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>