కేటీఆర్‌కు మద్దతిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ.. థాంక్స్ చెప్పిన మంత్రి...

తెలంగాణలోని జన్వాడలో ఫాంహౌస్‌కు సంబంధించి తలెత్తిన వివాదంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌కు బాసటగా నిలిచారు.

news18-telugu
Updated: June 6, 2020, 11:12 PM IST
కేటీఆర్‌కు మద్దతిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ.. థాంక్స్ చెప్పిన మంత్రి...
అసదుద్దీన్, కేటీఆర్
  • Share this:
తెలంగాణలోని జన్వాడలో ఫాంహౌస్‌కు సంబంధించి తలెత్తిన వివాదంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌కు బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ మేం మీకు అండగా ఉంటాం. మీరు మీ మంచి పనులను కొనసాగించండి. మీరు మంత్రిగా విజయవంతం కావడం చూసి రాజకీయ ప్రత్యర్థులు అసహనంతో ఉన్నారు.’ అంటూ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్స్ ఎంపీ సాబ్’ అంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారంటూ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత కొన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ఆ ఫాం హౌస్ మీద విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. తనకు ఎన్జీటీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. అది తన ఫాం హౌస్ కాదని, తనకు సంబంధం లేదని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు.

First published: June 6, 2020, 11:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading