Home /News /telangana /

Nizamabad : యాసంగి పంటలకు నీళ్లు ఇస్తాం.. కాని ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించండి..

Nizamabad : యాసంగి పంటలకు నీళ్లు ఇస్తాం.. కాని ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించండి..

prashanth reddy

prashanth reddy

Nizamabad : యాసంగి పంటలకు నీళ్లు విడుదల చేస్తాము.. కాని రైతులు వరి కాకుండా ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతులను కోరారు. యాసంగి పంటల కోసం అన్ని ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    న్యూస్18 తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్

    యాసంగి పంటల కోసం నీటి విడుదలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ( Prashanth reddy ) ఉమ్మడి జిల్లాలోని నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని ప్రాజెక్టుల కింద పంటలకు కావాల్సిన నీటి విడుదలకు నీటి పారుదల సలహా బోర్డు సమావేశం ఆమోదించింది.

    ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హరితహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలతో రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి అలుగులు పారాయన్నారు. రెండు జిల్లాల పరిధిలో పంటలకు నీటి విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించే విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు.


    Murder : ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్న స్నేహితుడి భార్యపై కన్ను... విషయం తెలిసిన ఫ్రెండ్ మరో స్కెచ్ వేశాడు...!


    పంటల మార్పిడిని ప్రోత్సహించాలి

    మరోవైపు యాసంగిలో పంటల మార్పు జరిగే అవకాశం ఉన్నందున.. రైతులు ఇతర పంటలు సాగు చేస్తే వారిని ప్రోత్సహించాలని మంత్రి అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ( SRSP ) కింద 43,242 ఎకరాల ఆయకట్టుకు 4.50 టీఎంసీలు, నిజాంసాగర్ కింద 1,98,280 ఎకరాల ఆయకట్టుకు 16.50 టీఎంసీలు, కౌలాస్ నాలా రామడుగు పోచారం ప్రాజెక్టుల కింద 25,280 ఎకరాలకు 2.832 టీఎంసీలు కలిపి మొత్తం 2,64,832 ఎకరాలలో యాసంగి పంటల సాగుకు 23.832 టీఎంసీలు నీటిని విడుదల చేయడానికి బోర్డు ఆమోదించిందని మంత్రి తెలిపారు.


    Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ


    రైతులు ఆలోచించాలి

    యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచించారు. వరి సాగు చేస్తే రైస్ మిల్లర్లతో ముందుగానే ఒప్పందం చేసుకోవాలని, తినడానికి అవసరం మేరకు చేసుకోవాలని, విత్తనాల కోసం సంబంధిత కంపెనీలు తీసుకునే విధంగా ఒప్పందాలుంటే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.


    Peddapally : పంచాయితీలోనే భార్యను.. బండతో కొట్టి ప్రాణాలు తీసిన భర్త




    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Minister prashant reddy, Nizamabad

    తదుపరి వార్తలు