Water supply in Hyderabad: ఓవైపు ఎండాకాలం తరుముకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. నీరు, కరెంటు వాడకం బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ (HMWSSB) షాకింగ్ విషయం చెప్పింది. నేడు (మార్చి 8) హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సప్లై సరిగా ఉండదని తెలిపింది. ప్రజలు నేడు ఒక్క రోజూ సర్దుకోవాలనీ... నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరింది. ఇలా ఎందుకంటే... నల్గొండ జిల్లాలోని కొండాపూర్, నర్సర్లపల్లి, గోడకొండ సబ్ స్టేషన్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో ప్రతిపాదిత పవర్ షట్ డౌన్ అయ్యింది. అక్కడ కొన్ని మరమ్మతులు చేస్తున్నారు. ఆ రిపేర్ల కారణంగా... నేడు నీటి సప్లై సమస్య వస్తోంది.
నీటి కొరత ఉండే ప్రాంతాలు:
HMWSSB చెప్పిన దాని ప్రకారం... సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్‌గఢ్, యాకుత్ పుర, మహబూబ్ మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, రియాసత్ నగర్, అలియాబాద్, మీరాలం, బీఎన్ రెడ్డి, ఆటోనగర్, వనస్థలిపురం, మారుతీ నగర్, ఎలుగుట్ట, హబ్సీగూడ, నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలాపేట్, మారెడ్‌పల్లి, కంటోన్మెంట్, MES, ప్రకాష్‌నగర్, మేకలమండి, బాలాపూర్, సాహెబ్‌నగర్, మైలార్ దేవులపల్లి, బండ్లగూడ, PDP, గోల్డైన్ హైట్స్, సులేమాన్ నగర్, 9నం. భోజగుట్ట, అల్లాబండ, గండంగూడ, అసిఫ్ నగర్, ప్రశాసన్ నగర్, మాధాపూర్, షేక్ పేట ప్రాంతాల్లో వారికి నీటి కొరత సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Fish Recipe: చేపల పులుసు కూర... ఇలా చేస్తే అద్భుతం... ఆ టేస్టే వేరు
నీటి కొరత తప్పనిసరా... వేరే మార్గం లేదా అంటే... HMWSSB అధికారులు లేదనే అంటున్నారు. పొదుపుగా నీరు వాడుకోవాలని సూచిస్తున్నారు. నేడు ఒక్క రోజూ సహకరించాలని కోరుతున్నారు.