Home /News /telangana /

WARNIG AND AWARENESS PROGRAMME TO FARMERS AND STUDENTS ON GANJAI IN ADILABAD ADB VRY

Adilabad : గంజాయి పండిస్తే... ఆ భూముల స్వాధీనం.. రంగంలోకి దిగిన ఐపిఎస్‌లు

గంజాయి పై రైతులు, మహిళలకు అవగాహన

గంజాయి పై రైతులు, మహిళలకు అవగాహన

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సహా ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనకు పోలీసు యంత్రాంగం కంకణం కట్టుకుంది. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది.

  గంజాయి అక్రమ రవాణాతో గుట్కా, మట్కా నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు గంజాయి వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ దాని నియంత్రణకు విద్యార్థులు, యువజనులతోపాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి గంజాయి ఉత్పత్తి, రవాణా చేస్తున్నవారితోపాటు వినియోగిస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృతంగా అవహాన సదస్సులను నిర్వహించడంతోపాటు నియంత్రణకు ప్రతిజ్ఞను కూడా చేయిస్తోంది.

  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా ఎస్.పి. ఉదయ్ కుమార్ రెడ్డి సహా పలువురు అధికారులు, మానసిక వైద్యులు పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్ధాల గురించి అవగాహన కల్పించారు. అటు మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శులు, వి.ఆర్.ఓలు, అంగన్ వాడి సిబ్బందికి నిషేదిత మత్తు పదార్థాలతోపాటు గంజాయిపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు మంచిర్యాల ఏ.సి.పి ఎస్. రష్మీ పెరమాళ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం అందరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను  డ్రగ్స్, గంజాయి రహిత గ్రామాలుగా మార్చేందుకు దృఢ నిశ్చయంతో ఉండాలని పిలుపునిచ్చారు.

  Hyderabad : హైద‌రాబాద్ ద‌గ్గ‌ర‌గా మ‌రో వీకెండ్ గేట్ వే ! భూటాన్‌ను తలపించే టూరిజం స్పాట్..!

  గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిపై కఠినపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో, పట్టణాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన  అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికితే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని, అలాగే పట్టా భూములలో గంజాయి దొరికితే ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్ద చేయడం జరుగుతుందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

  ఈ సంధర్బంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్స్ , ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర ప్రజా ప్రతినిధులతో  సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్  ఆవరణలో గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో  సీఐ సంజీవ్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్ కి బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో  బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించారు.

  Karimnagar : ఒక్క టీచర్.. గ్రామంలో చాలా మంది యువకుల జీవితాలకు వెలుగు

  ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బుల కోసం నేరాలకు పాల్పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ కు అలవాటుపడిన వారి మెదడు మొద్దుబారి, తాము ఏమీ చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి, విచక్షణ కోల్పోయి, తల్లిదండ్రలను ఎదిరిస్తూ, ప్రేమ పేరుతో బాలికలను వేధిస్తూ, పోక్సో కేసుల్లో నేరస్థులుగా మారుతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వైపు యువత ఎవ్వరూ ఆకర్షితులు కావద్దని, లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు మత్తుకు బానిసలుగా కాకుండా చూసుకోవాలని తెలిపారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Ganja smuggling

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు