హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ys Sharmila: నీరా టేస్ట్ చేసిన వైఎస్ షర్మిల..ప్రజాప్రస్థానం పాదయాత్రలో రేర్ సీన్

Ys Sharmila: నీరా టేస్ట్ చేసిన వైఎస్ షర్మిల..ప్రజాప్రస్థానం పాదయాత్రలో రేర్ సీన్

Ys Sharmila: నీరా టేస్ట్ చేసిన వైఎస్ షర్మిల..ప్రజాప్రస్థానం పాదయాత్రలో రేర్ సీన్

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ లో  కొనసాగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఓ రేర్ సీన్ చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ లో  కొనసాగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఓ రేర్ సీన్ చోటు చేసుకుంది. షర్మిల  (Ys Sharmila) పాదయాత్ర చేస్తున్న క్రమంలో లక్ష్మీనారాయణ పురం స్టేజ్ వద్ద ఓ గీత కార్మికుడు ఆమె వద్దకు వచ్చాడు.

CM KCR | Kondagattu Tour: కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు..ప్రకటించిన సీఎం కేసీఆర్

ఈ క్రమంలో ఆ గీత కార్మికుడు మీకోసం ప్రత్యేకంగా నీరా తీసుకొచ్చానని, రుచి చూడాలని రిక్వెస్ట్ చేశాడు. అయితే నీరా ఎలా ఉంటుందో తెలియదు వద్దని ఆమె అన్నారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న వారంతా..బాగుంటుంది తాగండని చెప్పారు. దీనితో తాటి ఆకులో గీత కార్మికున్ని నీరా పోయమని చెప్పడంతో పోశాడు. దానిని టేస్ట్ చేసిన ఆమె బాగుందని మరోసారి కొంచెం పోయమని అడిగారు. రెండోసారి తాగిన షర్మిల (Ys Sharmila) నీరా టేస్ట్ కి వెరైటీ రియాక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం.. ఈ ఆస్పత్రి ఎక్కడుందంటే..

కాగా తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఓ వైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరుపుతుండగా..షర్మిల కూడా చాలా రోజుల నుంచి పాదయాత్ర కొనసాగిస్తోంది. ఈ పాదయాత్రలలో వారు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని చెబుతున్నారు. అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేస్తూ పాదయాత్రలు కొనసాగుతున్నారు. పాదయాత్రలు జరిగే చోట ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, అక్కడి నాయకుల పని తీరును ఎండగడుతూ వస్తున్నారు.

కాగా నీరా టేస్ట్ చూసిన తరువాత షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో YSRTP అధికారంలోకి వచ్చిన తరువాత కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీనిచ్చారు.

First published:

Tags: Telangana, Telangana News, YS Sharmila

ఉత్తమ కథలు