• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WARANGAL YS SHARMILA FALLOWERS COUNTERD TO KONDA FAMILY ABOUT PARTY JOINING VS

warangal :కొండ దంపతులు వాడి ప‌డేసిన చెత్త.. వారు పార్టీలోకి వస్తే 10వేలు కూడ ఇవ్వం

warangal :కొండ దంపతులు వాడి ప‌డేసిన చెత్త..  వారు పార్టీలోకి వస్తే 10వేలు కూడ ఇవ్వం

కొండా మురళి, కొండా సురేఖ (File)

వైఎస్ ష‌ర్మిల‌ పెట్ట‌బోయే రాజ‌కీయ‌ పార్టీలోకి ఆహ్వానించార‌ని, అందు‌కు డబ్బులు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా కొండా ముర‌ళి చేసిన వాఖ్య‌ల‌ను ష‌ర్మిల‌ ప్ర‌ధాన అనుచ‌రులు పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.

  • Share this:
వైఎస్ ష‌ర్మిల‌ పెట్ట‌బోయే రాజ‌కీయ‌ పార్టీలోకి ఆహ్వానించార‌ని, అందు‌కు డబ్బులు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా కొండా ముర‌ళి చేసిన వాఖ్య‌ల‌ను ష‌ర్మిల‌ ప్ర‌ధాన అనుచ‌రులు పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే విలువ‌ల గురించి కొండా ముర‌ళి మాట్లాడ‌టం చూస్తుంటే దెయ్యాలు వేదాంతాలు వ‌ర్ణించిన‌ట్లుగా ఉంద‌ని ఎద్దేవ చేశారు.రాజకీయ విలువ‌ల గురించి మాట్లాడే ముందు వారి రాజ‌కీయ జీవితంలో ఎన్ని గుమ్మాలు తొక్కారో...ఎన్ని వాకిళ్లు తిరిగారో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలంటూ ష‌ర్మిల టీం కొండా దంప‌తుల‌కు కౌంట‌ర్ ఇచ్చింది.

ష‌ర్మిల ద‌గ్గ‌ర‌నుంచి కాని.. ప్ర‌ధాన అనుచ‌రుల ద‌గ్గ‌ర‌నుంచి కాని ఎటువంటి అహ్వానాలు కొండదంపతులకు పంప‌లేదని స్ఫష్టం చేశారు. క‌నీసం వారిని క‌లిసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదని అన్నారు... షర్మిల పార్టీలో చేరితే 10వేల కోట్లు వ‌స్తాయ‌ని త‌న‌కు తాను ప్ర‌క‌టించుకున్న కొండాముర‌ళి..మా పార్టీని డ‌బ్బులు పంపే పంపే పార్టీగా చెప్పడంపై వారు మండిపడ్డారు... డ‌బ్బులు ఇచ్చి చేర్పించుకోవ‌డానికి మా పార్టీ టీఆర్ఎస్ కాద‌నే విషయాన్ని కొండా దంప‌తులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.. వాళ్ల ప్రాతినిధ్యం వ‌హించే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనే భారిగా వైఎస్సార్ అభిమానులున్నారని. అందులో న్యాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న లీడ‌ర్లు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. యువ‌త‌ను ప్రోత్స‌హించి వారికి ఉన్న‌త ప‌ద‌వులు ఇవ్వాల‌నే సంక‌ల్పంతో ష‌ర్మిల గారు ఉన్నారని. . యువ‌కుల‌తో ,విద్యావంతుల‌తో స‌మాజానికి మంచి సేవ చేసే వారిని నాయ‌కులుగా మేమే త‌యారు చేసుకుంటామని వారు వివరించారు. అలాంటప్పుడు వారిని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని తెలిపారు.

YS Sharmila
నేడు ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష


కాగా వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయో పార్టీలోకి వెళ్లమని కొండ దంపతులు స్పష్టం చేశారు. డబ్బు కంటే పరువు ముఖ్యమని ఈ సంధర్బంగా పేర్కోన్నారు. పార్టీలో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.తమకు వైఎస్ షర్మిల పార్టీలో చేరితే డబ్బులు వస్తాయని కాని,తమకు పార్టీలు, డబ్బులకంటే ఆత్మాభిమానం ముఖ్యమని కొండదంపతులు స్ఫష్టం చేశారు. పార్టీలకంటే కొన్ని విలువలు ముఖ్యమని కొండ మురళి స్ఫష్టం చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని , భవిష్యత్ కూడ అదే పార్టీలో కొనసాగుతానని అన్నారు. గతంలో పార్టీలు మారడం వల్ల కొన్ని చేదు అనుభావాలు ఎదురయ్యాయని వారు గుర్తు చేసుకున్నారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు