హోమ్ /వార్తలు /తెలంగాణ /

Viral video: రీల్స్‌ కోసం రైలుతో చెలగాటం .. సోషల్ మీడియా సరదా ఎట్లా తీరిందో తెలుసా

Viral video: రీల్స్‌ కోసం రైలుతో చెలగాటం .. సోషల్ మీడియా సరదా ఎట్లా తీరిందో తెలుసా

reels stunt

reels stunt

Viral video: అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో జనం వెర్రి పనులు, అనవసరమైన స్టంట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌లు వస్తాయనే పిచ్చి సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వరంగల్‌ జిల్లాలో ఓ యువకుడు రీల్స్‌ కోసం రైల్‌తో చెలగాటమాడాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(P.Srinivas,New18,Warangal)

అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో జనం వెర్రి పనులు, అనవసరమైన స్టంట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వ్యూస్(Views), లైక్‌(Like)లు వస్తాయనే పిచ్చి సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లను ఆశ్చర్యపరచాలనే కుతూహలంతో ..తమ ప్రాణాలకే ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. వరంగల్ (Warangal)జిల్లాలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే ఈ వింత సంస్కృతికి ఎంతటి ప్రమాదానికి కారణమైందో తెలుస్తుంది.

Crime news : మద్యం తాగొచ్చి కూతుర్ని కాటేసిన తండ్రి .. ఇంతటి దారుణం ఎక్కడ జరిగిందో తెలుసా..?రీల్స్ కోసం రైలుతో చెలగాటం..

ఏదో విధంగా మనం కూడా అందరి కళ్లలో పడాలి. అందుకోసం కొత్తగా ఏదైనా చేయాలని కుర్రాళ్లు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ కోసం వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు పెద్ద రిస్క్ చేశాడు. వరంగల్ వడ్డేపల్లికి చెందిన అజయ్ ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లాడు. ట్రైన్ వస్తున్న సమయంలో అజయ్ ట్రాక్‌ పక్కన నడుస్తున్నాడు. అదే దృశ్యాన్ని రీల్స్ కోసం ఫ్రెండ్స్ వీడియో షూట్ చేస్తున్నారు. ఎక్కువ దూరం లేకుండా ట్రైన్ పక్కనే నడుస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు అజయ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. జేబులో చేతులు పెట్టుకొని నడుస్తుండగానే రైలు ముందు భాగం తగిలి ట్రాక్ పక్కన పడిపోయాడు.

వెంట్రుక వాసిలో తప్పిన చావు..

వీడియో షూట్ చేస్తున్న అజయ్ ఫ్రెండ్స్‌కి ట్రైన్ తగులుతుందని తెలిసి వద్దురా అజయ్ అంటూ అరిచారు. అయితే ట్రైన్‌ సౌండ్‌కి వెనక్కి తిరిగి చూసుకునేలోపే రైలు తగలడం...యువకుడు కిందపడిపోవడం అంతా రెప్పపాటు సమయంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన అజయ్‌ని స్నేహితులు వెంటనే హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రగాయలవడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. రీల్స్ వీడియో కోసం స్టంట్ చేసి తీవ్రంగా గాయపడిన అజయ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదని హెచ్చరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Gaddar : నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్నగద్దర్ .. ఆయన న్యూ గెటప్ ఎలా ఉందంటేఈ పద్దతి మానుకోడండి..

యువతి, యువకులు, సెల్ఫీలు, రీల్స్, షేర్‌చాట్‌ వీడియోల కోసం ఇలాంటి సాహసాలు చేయవద్దంటున్నారు పోలీసులు. ఎవరో చూసి లైక్ కొడతారనే ఆశతో మీ జీవితాల్ని ఇబ్బందుల్లో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, Viral Video, Warangal

ఉత్తమ కథలు