Home /News /telangana /

WARANGAL YOU WILL BE SHOCKED TO KNOW THE NEW INSURANCE FRAUD IN THE JOINT WARANGAL DISTRICT MMV BRV PRV

Mulugu: ఇన్సురెన్సు కట్టిస్తే వచ్చే జీతం, కమిషన్​ చాలడం లేదని ఆ ఏజెంట్​ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలుసా?

ఇన్సురెన్స్​ స్కాం

ఇన్సురెన్స్​ స్కాం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ పేరుతో దొరికినంత దోచుకున్నాడు ఓ ఏజెంట్. సినిమా కథను తలపించిన ఈ ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ (Insurance) పేరుతో దొరికినంత దోచుకున్నాడు ఓ ఏజెంట్. సినిమా కథను తలపించిన ఈ ఘటన వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. "వారందరూ అనాథలు (Orphans)..నా అనేవారు ఎవరూ లేరు. అనాథాశ్రమాలలో పెరిగి ఉన్నత చదువులు చదువుకొని ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరిని ఒక బీమా సంస్థ (Insurance Company) ,  బీమా సంస్థలో పనిచేసే ఏజెంట్లు టార్గెట్ చేసుకుంటారు. అనాథలకు తెలియకుండానే వారిపై కోట్ల రూపాయలకు బీమా చేస్తారు. దానికి సంబంధించిన ప్రీమియంలు (Premiums) కూడా వారే కడతారు.

    ఎవరూ లేని అనాథలు కదా... కంపెనీ ఏజెంట్లే నామినీలుగా పెట్టుకుంటారు. సీన్ కట్ చేస్తే పాలసీ కట్టిన సంవత్సరం తరువాత ఒక్కొక్కరిగా ఆ ఏజెంట్లు వారందరి హతమార్చి నకిలీ ధ్రువపత్రాలతో పాలసీకి సంబంధించిన కోట్ల రూపాయలను క్లైమ్ చేసుకొని సమానంగా పంచుకుంటారు". ఇదంతా ఒక సినిమా కథ. ఇంచుమించు ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో చోటుచేసుకుంది.



    నల్లబెల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి పలు బీమా సంస్థలలో పాలసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. పాలసీలు చేస్తే  కమిషన్, కొంత జీతం వస్తుంది. అయితే ఈ డబ్బు సరిపోలేదేమో.. పైన మనం చెప్పుకున్న సినిమా కథ చూశాడు కావచ్చు. అతనికి తోడు ఇంకొంత మందిని కలుపుకున్నాడు. వీరందరూ ఒక టీంగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకున్నారు.

    Rajanna Sircilla: మత్తులో చిత్తవుతున్న యువకులు: రాకెట్​ ఛేదించే దిశలో పోలీసు విభాగం

    పాలసీలు చేయించిన అనుభవం ఉన్న ఆ వ్యక్తి వాటిలో కొన్ని లొసుగులు పట్టుకొని మోసాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాటికి కాలు చాపిన వ్యక్తులనే టార్గెట్‌గా చేసుకున్నారు. అటువంటి వారి కుటుంబ వివరాలను ఆరా తీస్తూ వారిపై వారికి తెలియకుండానే పాలసీలు చేశారు. పాలసీ కాపీల్లో నామినిగా తమ పేర్లను పెట్టుకున్నారు. ఇంకేముంది పాలసీదారుడు అనారోగ్యంతో మరణించాక నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఆ పాలసీకి సంబంధించిన డబ్బులను క్లైమ్ చేసుకొని అందరూ సమానంగా పంచుకున్నారు.

    ఈ ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారంలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి మొత్తం సూత్రధారిగా నల్లవెల్లి మండలానికి చెందిన ఇన్సూరెన్సు ఏజెంట్‌గా (Insurance Agent) పోలీసులు నిర్ధారించుకున్నారు. కొంతమందిని బతికుండగానే చంపినట్లు నకిలీ ధృవపత్రాలను పాలసీకి సంబంధించిన డబ్బులను కూడా క్లైమ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    నిజానికి బీమా కంపెనీలకు తెలియకుండానే ఇదంతా వ్యవహారం జరిగిందా? లేక బీమా కంపెనీలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారా? ఎంత మందిని మోసం చేశారు...? ఎంత సొమ్ము దండుకున్నారు ...? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు రావాల్సి ఉంది. పోలీసుల విచారణ అనంతరం వారు చెప్పే వివరాలే అంతిమంగా ఉంటాయి కాబట్టి పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూడాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Life Insurance, Local News, Mulugu, Warangal

    తదుపరి వార్తలు