హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: లిఫ్ట్ ఇస్తానంటూ వృద్ధురాలిపై అత్యాచారం చేసిన దౌర్భాగ్యుడు

Warangal: లిఫ్ట్ ఇస్తానంటూ వృద్ధురాలిపై అత్యాచారం చేసిన దౌర్భాగ్యుడు

లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమానుషం

లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమానుషం

Telangana: లిఫ్ట్ ఇస్తానంటూ వృద్ధురాలిని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జనగాం జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : వరంగల్

లిఫ్ట్ ఇస్తానంటూ వృద్ధురాలిని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జనగాం జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. ఎస్సై వీరేందర్ కథనం ప్రకారం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన ఎండి అక్బర్ 2017లో అదే గ్రామానికి చెందిన వృద్ధురాలిని బస్టాండ్ నుంచి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బైక్ పై ఎక్కించుకున్నాడు.

అక్కడ నుండి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పలుమార్లు కోర్టులో వాదనలు జరిగగా.. చివరికి నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

చోరీకి పాల్పడ్డ ఘటనలో పోలీసుల అదుపులో ముగ్గురు..

ఉమ్మడి వరంగల్ జిల్లా కొరివి మండల కేంద్రంలో ఇటీవల 3 ఇళ్లలో చోరీ జరిగిన ఘటనలో కొరివికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 24న ఇళ్లలో చోరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పోలీసుల విచారణలో వెంకటేశ్వరకాలనీకితో పాటు పక్క కాలనీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా దొంగతనంలో ముగ్గురితో పాటు మరికొందరి హస్తం ఉన్నట్లు సమాచారం. పోలీసులు అదుపులో ఉన్న వారిలో మైనర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయమై ఎస్సై వివరణ కోరగా విచారణ కొనసాగుతుందని రెండు రోజుల్లో కేసు వివరాలు చెప్తామని తెలిపారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు