(P.Srinivas,New18,Karimnagar)
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నీ వసతులతో కూడిన ఇంటిని తక్కువ ఖర్చుతో కట్టుకోవడం అంత సులువుగా అయ్యే పని కాదు. పెరిగిన సిమెంట్(Cement), ఐరన్(Iron), ధరలతో పాటు కూలీల డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఓ ఇంటిని ప్లాన్ చేస్తే కనీసం 40లక్షల ఖర్చు అవుతుంది. అయితే అది కూడా నెల , రెండు నెలల్లో పూర్తి కావడం సాధ్యమయ్యే పని కాదు. కాని కేవలం 60రోజుల్లో సకల సౌకర్యాలతో కూడిన ఇంటిని హైదరాబాద్(Hyderabad)లో నిర్మించుకొని హన్మకొండ(Hanmakonda)కు తీసుకెళ్లి గృహప్రవేశం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఇంటిని హైదరాబాద్‌లో కట్టించుకొని హన్మకొండకు తీసుకెళ్లడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు కదా. అవును ఆయనకు వచ్చిన ఐడియా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనతో పాటు అప్డేట్ కావాల్సిందే.
వుడెన్ హౌస్ మేకింగ్ ..
వుడెన్ హౌస్‌లో ఉండాలంటే ఊటికి వెళ్లాల్సిన పని లేదు. హాయిగా హన్మకొండలోనే ఉండవచ్చు. అదెలా అని ఆశ్చర్యపోకండి. గోవా , ఊటి, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో కనిపించే అందమైన చెక్కతో తయారు చేయబడిన ఇళ్లు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా తయారు చేస్తున్నారు. ఇందులో ఇంకా విచిత్రం ఏమిటంటే ..ఓ ఫ్యామిలీ నివసించేందుకు వీలుగా ఉండేలా హాల్, కిచెన్, బాల్కనీ, బెడ్రూం, బెడ్రూంకి అటాచిడ్ బాత్రూం, లెట్రిన్‌తో కూడిన చెక్కలతో తయారు చేసిన వుడెన్ హౌస్‌ని హైదరాబాద్ జీడిమెట్లలో తయారు చేశారు. హన్మకొండకు చెందిన సతీష్‌గౌడ్ అనే వ్యక్తి ఈ ఇంటిని చూసిన వెంటనే నచ్చడంతో ఆర్డర్ చేసి తయారు చేయించుకున్నాడు. నాలుగు టన్నుల ఇనుముతో పాటు చెక్కలతో ఈ ఇంటిని రూపొందించారు.
ఎక్కడికైనా తరలించే ఇల్లు..
హైదరాబాద్ జీడిమెట్లలో తయారు చేయించిన ఈ వుడెన్ హౌస్‌ని కంటైనర్‌లో భద్రంగా హన్మకొండకు ట్రాన్స్‌పోర్ట్‌లో తరలిచారు. తనకు చెందిన కాళీ స్తలంలో ఈ వుడెన్ ఇంటిని తీసుకొచ్చి ఫిక్స్ చేయడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యమైంది..? ఇలాంటి ఇళ్లు కట్టించాలన్న ఐడియా ఎలా వచ్చిందంటూ యజమాని సతీష్‌ని అడిగి తెలుసుకుంటున్నారు.
నాల్గో వంతు ఖర్చుతో ఇల్లు రెడీ ..
సాధారణంగా ఇలాంటి ఇల్లును సిమెంట్, ఇటుకలు, కూలీలతో కట్టిస్తే 40 లక్షలు ఖర్చు అవుతుందని అందుకే చెక్క, ఇనుముతో కట్టించానని యజమాని సతీష్‌గౌడ్ చెప్పారు. ఈ వుడెన్ హౌస్‌ని కట్టించడానికి ఎనిమిదన్నర లక్షలు ఖర్చు అయిందన్నాడు. అయితే సాధారణంగా 45రోజుల్లో పూర్తి చేయాల్సిన ఇంటిని వర్షాల కారణంగా ఆలస్యమైందన్నారు సతీష్.
వాటే ఐడియా సర్ జీ..
అతి తక్కువ స్తలంలో తక్కువ ఖర్చుతో ..అతి తక్కువ సమయంలో నిర్మించడమే కాకుండా ..సిమెంట్, ఇటుకలతో నిర్మించే డబ్బులో నాల్గో వంతు డబ్బుతో పూర్తి చేయడం చూసి స్థానికులు ముక్కన వేలేసుకుంటున్నారు. ఇంతటి అప్డేట్ ఐడియా ఎలా వచ్చిందంటూ ఇంటి యజమాని సతీష్‌ని అభినందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News, VIRAL NEWS, Warangal