హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubabad:వామపక్ష నాయకుడి ముసుగులో నయవంచకుడు..వీడియోలో గోడు వెళ్లబుచ్చుకున్న బాధితురాలు

Mahabubabad:వామపక్ష నాయకుడి ముసుగులో నయవంచకుడు..వీడియోలో గోడు వెళ్లబుచ్చుకున్న బాధితురాలు

(నాయకుడు కాదు నయవంచకుడు)

(నాయకుడు కాదు నయవంచకుడు)

Mahabubabad:ఓ వామపక్షనేత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకురాలిని లోబర్చుకున్నాడు. 12ఏళ్లుగా తన కోరిక తీర్చుకుంటూ రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడు. న్యాయం చేయమని బాధితురాలు కోరితే బెదిరింపులకు పాల్పడటంతో..తన బాధను వీడియో రూపంలో చెప్పుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంకా చదవండి ...

(G.Srinivasareddy,Correspondent,News18Telugu,Khammam)

మానవ హక్కుల రక్షణ, పెత్తందారుల దౌర్యన్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఓ కమ్యునిస్ట్ నాయకుడు కామాంధుడిగా మారాడు. వామపక్ష భావజాలంతో కమ్యూనిస్టు నాయకురాలిగా ఉన్న తోటి మహిళను గత 12ఏళ్లుగా అన్నీ విధాలుగా వాడుకుంటున్నాడు. ఆదరిస్తానని...న్యాయం చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చివరకు నిన్ను పెళ్లి చేసుకోను..నీకు దిక్కున్నకాడ చెప్పుకోమని బెదిరిస్తున్నాడు. బాధితురాలే స్వయంగా విషయాన్ని సోషల్ మీడియా(Social media) వేదికగా బయటపెట్టడంతో ఆ కమ్యూనిస్ట్‌ ముసుగులో ఉన్న కామాంధుడి రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మహబూబాబాద్ (Mahabubabad)జిల్లా కురవి(Kuravi)మండలం తట్టుపల్లి(Tattupalli)గ్రామానికి చెందిన నక్క సైదులు (Nakka Saidulu)అనే వ్యక్తి ఓ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా, మండల పార్టీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇదే జిల్లాలోని నేరడ గ్రామానికి చెందిన సునీత (Sunitha)కూడా అనుబంధ మహిళా సంఘం మండల కార్యదర్శి గా, సిపిఎం(Cpm) పూర్తికాలం కార్యకర్తగా పని చేస్తోంది. వీళ్లిద్దరికి 2008లో పరిచయమైంది. సునీతను కార్యక్రమాల పేరుతో తన బైకుపై తిప్పడం మొదలుపెట్టాడు. అదే చనువుతో మాయమాటలు చెప్పి చివరకు ఆమెను లోబర్చుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తన కామవాంఛ తీర్చమి బలవంతం పెట్టాడు. అందుకు బాధితురాలు తిరస్కరించడంతో రెండో పెళ్లి చేసుకుంటానని సైదులు సునీతకు మాటిచ్చాడు. కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి చివరకు ఆమెను శారీరంగానే కాకుండా మానసీకంగా, ఆర్దికంగా వాడుకుంటూ వచ్చాడు.

ఇదేమైనా పద్దతేనా కామ్రెడ్..

ఈ విధంగా 12 సంవత్సరాలుగా సునీతను వాడుకున్న సైదులు పెళ్లి ప్రస్తావనకు తెస్తే రెండో భార్యగా స్వీకరించనని దిక్కున్న చోట చెప్పుకో అంటూ తన అసలు బుద్ధి బయటపెట్టుకున్నాడు. శారీరకంగా, మానసీకంగానే కాదు చివరకు తన దగ్గర నుంచి సైదులు 16లక్షలు డబ్బులు తీసుకున్నాడని...అవి కూడా ఇప్పుడు తిరిగి ఇచ్చే సమస్యే లేదని తెగేసి చెప్పాడంతో బాధితురాలు న్యాయం కోసం పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీ లకు ఫిర్యాదులు చేసింది. ఎవరూ సునీత గోడు పట్టించుకోకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్రమనోవేదనకు గురైంది.

నాయకుడి వేషంలో నయవంచకుడు..

ఓ సామాజిక భావాలు కలిసిన ఉద్యమంలో ఉన్న వ్యక్తి తనను అన్ని విధాలుగా వాడుకొని అన్యాయం చేయడమే కాకుండా ఈ విషయాన్ని బయట పెడితే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో వేరే గత్యంతరం లేక బాధల్ని స్మార్ట్ ఫోన్‌లో వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో సైదులు నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది బాధితురాలు. ఓ నయవంచకుడి చేతిలో మోసపోయిన తనకు ఇప్పటికైన న్యాయం చేయాలని సదరు బాధితురాలు వేడుకుంటుంది. లేనిపక్షంలో మహిళా సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని పార్టీపై పోరాటానికి సిద్ధమతానని హెచ్చరించింది. సునీత మోసపోయినట్లుగా సర్క్యులేట్ అవుతున్న వీడియోపైనే మహబూబాబాద్ జిల్లా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

First published:

Tags: Crime news, Telangana, Viral Video

ఉత్తమ కథలు