హోమ్ /వార్తలు /తెలంగాణ /

భర్త దూరమయ్యాడని.. మరొకరికి దగ్గరైంది. కానీ ఆ బంధమే..

భర్త దూరమయ్యాడని.. మరొకరికి దగ్గరైంది. కానీ ఆ బంధమే..

వరంగల్‌లో మహిళ ఆత్మహత్య

వరంగల్‌లో మహిళ ఆత్మహత్య

ఆరు నెలల క్రితం ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, వనిత కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని చెప్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

భర్త దూరమయ్యాడని.. మరొకరికి దగ్గరైంది. కానీ ఆ బంధమే ఆమె ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ (Warangal) కేంద్రంలోని 15 డివిజన్ లో వనిత అనే మహిళ ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గొర్రెకుంట పశుసంవర్ధక శాఖ బొల్లిగుంట పశువుల ఆసుపత్రిలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న వనిత వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ప్రభాకర్, వనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే గత ఆరు నెలల క్రితం ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, వనిత కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని చెప్తున్నారు. కొద్దిరోజులుగా వనితకి ప్రియుడికి మధ్య మనస్పర్ధల కారణంగా గొడవలు వచ్చాయని.. ఈ కారణంగా ప్రియుడు ఆమెకు ఫోన్ చేయడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.

వినీత సెల్ ఫోన్ లో ఐ మిస్ యు అనే సందేశం ఉండడంతో అదే కారణంగా భావిస్తున్నారు. ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. గీసుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే తండ్రి మరణించగా.. ఇప్పుడు తల్లి కూడా ఇలా మరణించడంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

ఇది చదవండి: చెరువు గ‌ట్టున ఏం జ‌రిగింది.. అత‌డు ఎందుకు శ‌వ‌మైయ్యాడు..!

మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య..!

స్కూలుకు వెళ్ళమని తల్లిదండ్రులు మందలించినందుకు వరంగల్ కేంద్రంలోని చింతలకు చెందిన ముత్యాల నవ్య ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నవ్యను తల్లిదండ్రులు స్కూలుకు వెళ్ళమని మందలించారు. దీంతో మనస్తావం చెందిన నవ్య ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు బాధితులను సముదాయించి హాస్పిటల్ యజమాన్యంతో చర్చలు జరిపారు.

ఇది చదవండి: కన్నపేగు తెంచుకున్న తల్లి.. కానీ ఆమెను నిందించలేని పరిస్థితి..!

ఏసీపీ గురుకుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స లోపం జరిగిందని అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తామని, కానీ ఆస్పత్రిపై దాడులు చేయడం సరికాదని, అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్న దానిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. ఈ విషయంపై ఆసుపత్రి యజమానం మాట్లాడుతూ.. కొన ఊపిరితో ఉన్న బాలికకు సీపీఆర్ చేసి కుటుంబీకులతో చర్చించి వైద్యం చేశామని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. అయినప్పటికీ బాలిక కుటుంబ సభ్యులు రాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. బాలిక తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

First published:

Tags: Extramarital affairs, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు