Warangal Crime News: చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ మహిళ.. ఎంత దారుణానికి ఒడిగట్టిందో తెలుసా..

ఆందోళన చేస్తున్న బాధితుడు

Warangal News: చిట్టీలు అనేవి తమకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడతాయనే కారణంతో వేస్తుంటారు. ఇలా ఏదో ఒక అవసరం కోసం చిట్టీవేసి లిఫ్ట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా కస్టమర్లను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి దాడికి తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఈ మధ్యకాలంలో భోగస్ చిట్ ఫండ్ కంపెనీలు(Fraud Chitfunds) విపరీతంగా వెలుస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి.. స్కీమ్ లో చేరడానికి గిఫ్ట్ (Gifts) లు కూడా ఉంటాయంటూ మోసం చేస్తున్నారు. తీరా చేరిన తర్వాత లక్షల రూపాయలను వసూలు చేసి అక్కడ నుంచి చెక్కేస్తున్నారు. చిట్టీ పాడుకొని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ చిట్ ఫండ్ కంపెనీ(Company) నిర్వాహకులు దారుణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్(Warangal) లో ప్రైవేట్ చిట్‌ఫండ్స్ (Chitfund) నిర్వాహకుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని మాటలతో నమ్మించి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం పరిపాటైపోయింది.

  చోటా మోట నాయకుల అండదండలతో లక్షల రూపాయాలు వసూలు చేసి ప్రశ్నించిన వారిని బెదిరించడం, దాడులు చేయడం చేస్తున్నారు. చిట్టీ ఎత్తుకున్నా డబ్బులు ఇవ్వడానికి నిర్వాహకులు రేపు.. మాపు అంటూ తిప్పిస్తున్నారు. ఇలా సంవత్సరాలు గడిచినా డబ్బులు మాత్రం చేతికి రావడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో దాడులు చేయిస్తున్నారు.

  Newborn Baby: చెత్త కుప్పలో మగ శిశువు.. బావిలో దూకిన మైనర్ బాలిక.. అసలేమైందంటే..

  హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌లో రాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అచల చిట్‌ఫండ్‌లో చిట్టివేసి మూడు నెలల క్రితం లిఫ్ట్ చేశాడు. అప్పటి నుంచి కంపెనీ చిట్టీ డబ్బులు ఇవ్వకుండా రేపు, మాపంటూ కాలం వెళ్లదీస్తుంది. దీంతో విసుగు చెందిన రాజు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ చిట్స్‌ కార్యాలయం వద్ద ఏజెంట్‌ని గట్టిగా నిలదీశాడు.

  Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

  ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద గురువారం ఆందోళనకు దిగాడు. అది మనసులోపెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టీ ఏజెంట్ భార్యతో అతని దుకాణం పైన.. అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి మత్నించింది. ఈ సంఘటనలో రాజు సెల్ ఫోన్ దుకాణం పూర్తిగా దగ్ధమవగా.. రాజు పైన కూడా పెట్రోల్ పోసి అంటించడంతో రాజు కూడా మంటల్లో కాలిపోయాడు. స్థానికులు వెంటనే అతనికి అంటుకున్న మంటలని ఆర్పే ప్రయత్నం చేశారు

  .Minor Girl: ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి.. నగ్న వీడియోలను వెబ్ సైట్ లో పోస్టు చేసిన బాలిక.. చివరకు..

  స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేయగా.. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అక్కడే ఉన్న మరో షాపు యజమానికి కూడా ఆ మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు (Trail) ప్రారంభించినట్లు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: