హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: భర్త కళ్లలో కారం చల్లి..తర్వాత కత్తితో పొడిచి చంపింది..ఎందుకో తెలుసా

OMG: భర్త కళ్లలో కారం చల్లి..తర్వాత కత్తితో పొడిచి చంపింది..ఎందుకో తెలుసా

(కళ్లలో కారం చల్లి..కత్తితో పొడిచి)

(కళ్లలో కారం చల్లి..కత్తితో పొడిచి)

Warangal:జనగామలో దారుణం జరిగింది. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య దగ్గరకు వెళ్లిన భర్త హత్యకు గురయ్యాడు. భార్యే కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి చంపేసింది. కేవలం భార్య, భర్తల మధ్య మనస్పర్దలు, గొడవ కారణంగానే ఇంతటి దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

కొందరు వ్యక్తుల్లో మానవసంబంధాలు రాను రాను రక్తం రుచి చూసేలా తయారవుతున్నాయి. మనస్పర్ధలు, ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, అనారోగ్య సమస్యలు సిస్ట్యూవేషన్ ఏదైనా క్షణికావేశంతో అత్యంత కిరాతకానికి ఒడిగడుతున్నారు. హంతకులుగా మారిపోతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో కూడా ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. జనగామ (jangoan)టౌన్‌ అంబేద్కర్‌నగర్‌ (Ambedkar Nagar) కి చెందిన మంజుల (Manjula)కట్టుకున్న భర్త వినోద్‌ (Hunamandla Vinod)ని అత్యంత కిరాతకంగా తండ్రి, మైనర్‌(Minor)గా ఉన్నటువంటి కొడుకు సాయంతో హతమార్చింది. భార్య తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో వినోద్‌ మంగళవారం రాత్రి జనగామలోని అత్తారింటికి వెళ్లాడు. మద్యం తాగి ఉండటంతో అత్తమామలతో భార్య విషయంపై గొడవ పడ్డాడు. భర్త చేస్తున్న గొడవ నచ్చకపోవడంతో నిందితురాలు మంజుల వినోద్‌ కళ్లలో కారం చల్లింది. వెంటనే ఇంట్లో ఉన్న కత్తితో వినోద్‌పై మంజుల, కొడుకు, ఆమె తండ్రి పొడిచారు. కత్తిపోట్లకు గురైన వినోద్‌కు తీవ్రరక్తస్రావం కావడంతో ఇంటి దగ్గరే ప్రాణాలు విడిచాడు. అసలు హత్యకు కారణం ఏమిటంటే..రెండేళ్ల క్రితం అంబేద్కర్ నగర్‌లో ఉంటున్న మంజులను హైదరాబాద్ (Hyderabad)పార్శి గుట్ట(Parsi Gutta)కు చెందిన హునమాండ్ల వినోద్ రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ క్రమంలోనే భర్తతో గొడవపడ్డ మంజుల తన కొడుకును తీసుకొని కొద్దిరోజుల క్రితం పుట్టినిల్లైన జనగామకు వచ్చింది.

భార్యే చంపింది..

తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన మంజులతో మాట్లాడేందుకు వినోద్ జనగామకు వెళ్లాడు. మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో అత్తమామలు, భార్యతో వినోద్‌ ఘర్షణ పడ్డాడు. రాత్రి 9గంటల సమయంలో మాటలతో మొదలైన గొడవ చివరకు కళ్లలో కారం చల్లుకోవడం , కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది. మంజుల తన మైనర్‌ కొడుకు సాయంతో భర్త కళ్లలో కారం చల్లింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో వినోద్‌ని పొడిచి చంపారు మంజుల ఆమె కొడుకు, తండ్రి. భార్యభర్తలకు పెళ్లిన దగ్గర నుంచి  అప్పుడప్పుడు గొడవపడుతూ ఉండేవారని పోలీసుల విచారణలో తేలింది. రెండో పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది.

కళ్లలో కాలం చల్లి మరీ..

సంఘటనా స్థలానికి చేరుకున్న జనగామ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వినోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసులో నిందితుల్ని , అనుమానితుల్ని విచారిస్తున్నామని ఏ సి పి జి కృష్ణ, సిఐ శ్రీనివాస్ చెప్పారు. పూర్తి వివరాలు వెల్లడైన తర్వాత దోషలకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.

First published:

Tags: Crime news, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు