హోమ్ /వార్తలు /తెలంగాణ /

పక్కింటి కుర్రాడితో భార్య ఎఫైర్.. తప్పు అని చెప్పిన భర్తను ఏం చేసిందో చూడండి.. బాబోయ్..!

పక్కింటి కుర్రాడితో భార్య ఎఫైర్.. తప్పు అని చెప్పిన భర్తను ఏం చేసిందో చూడండి.. బాబోయ్..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Warangal: వాళ్లిద్దరిదీ 12ఏళ్ల దాంపత్యం. వారికి ఇద్దరు పిల్లలు. కానీ ఇంతలో పక్కింటి యువకుడి కారణంగా వారి జీవితంలో చిచ్చురేగింది. పూర్తిగా అతడి మాయలో పడిన భార్య.. భర్తను చంపడానికి కూడా వెనుకాడలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తను భార్య హతమార్చిన ఘటనలు ఇటీవల వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి అక్రమ సంబంధం వరకు దారితీస్తుంటే అన్ని రోజులు కలిసి ఉన్న దాంపత్య జీవితం ఎందుకు గుర్తుకు రావడం లేదు. వారి పిల్లల భవిష్యత్తు ఎందుకు తల్లిదండ్రులు ఆలోచించడం లేదు అనే ప్రశ్నలు సమాజంలో ఎదురవుతున్నాయి. అక్రమ సంబంధాలు (Extramarital Affairs) ఎంతవరకు దారి తీస్తున్నాయంటే అన్యోన్యంగా కలిసి జీవించిన భాగస్వామిలో ఒకరిని చంపేవరకు దారితీస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య చంపిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
  12 సంవత్సరాల అన్యోన్య దాంపత్యం ఒక పరిచయం వల్ల కటకటాల పాలయింది. పక్కింటి యువకుడితో పరిచయం.. చివరకు కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వర్ధన్నపేట ఎసిపి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఆర్ఎంపి సురేష్, సరిత ఇద్దరు భార్యాభర్తలు. 12 ఏళ్ల వీరి దాంపత్యానికి సాక్షిగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

  ఇది చదవండి: ప్రియుడి కోసం భర్తను ఇంట్లోకి లాక్కెళ్లి దారుణం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య..

  సురేష్ ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ పక్కింట్లో ఉండే యువకుడితో సరిత పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది. సరిత అక్రమ వ్యవహారం గురించి తెలుసుకున్న భర్త రమేష్ భార్యను హెచ్చరించాడు.

  ఇది చదవండి: ఉద్యోగాల పేరుతో నిండా ముంచిన దళారులు: బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్పందించరా?

  ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని రమేష్ ను వదిలించుకోవాలని భావించిన సరిత, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాత్రి సమయంలో సరిత ప్రియుడితో కలిసి సురేష్‌ను హతమార్చి... మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో వేస్తుండగా ఇద్దరు కుమార్తెలు ప్రత్యక్షంగా చూశారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  ఇటీవల పెద్దపల్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎండీ అజీంఖాన్ అనే వ్యక్తి.. శ్రావణి అనే యువతిని కులమతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఐతే ఇటీవల శ్రావణీ తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించిన అజీంఖాన్.. శ్రావణిని హెచ్చరించాడు. ఈ క్రమంలో భర్తతో గొడవపడ్డ శ్రావణి.. అతడ్ని ఇంట్లోకి లాక్కెళ్లి గొంతు నులిమి, బ్యాట్ తో కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణితో పాటు ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Extramarital affairs, Local News, Telangana

  ఉత్తమ కథలు