(Pranay Diddi, News 18, Warangal)
హాట్ సమ్మర్ (Hot Summer)లో ఎండ దెబ్బ నుంచి మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే కేవలం చల్లటి మంచి నీరు మాత్రమే కాదు, జ్యూస్, మజ్జిగ, లస్సి వంటి ఇతర పానీయాలను తీసుకోవాలి. వేడి గాలుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ (Glucose) స్థాయిలు పడిపోకుండా మనం రక్షించుకోవచ్చు. ఇక ఎండాకాలం వచ్చిందంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు ఎక్కువగా సేవించేది లస్సి (Lassi). దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా లస్సి లభిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రజలకు గుర్తుండిపోతాయ్. వరంగల్ జిల్లాలోనూ ఇదే తరహా లస్సి సెంటర్ ఉంది. వరంగల్‌లోని గరిమాజీపేట్ పరిధిలోని చార్బౌలి సర్కిల్ వద్ద గత 20 ఏళ్లుగా ఓ వ్యక్తి లస్సి సెంటర్ నిర్వహిస్తున్నాడు. వరంగల్ (Warangal) నగరంలో ఓ ల్యాండ్ మార్క్‌గా చెప్పబడుతున్న ఈ "కూల్ అండ్ కూల్" లస్సి సెంటర్ (Cool and Cool Lassi Center).. జిల్లాతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ ఎంతో ఫేమస్.
20 ఏళ్లుగా లస్సి సెంటర్ నిర్వహిస్తున్న వైనం:
అత్తర్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఈ "COOL N COOL" లస్సి సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత 20 సంవత్సరాల (20 Year old shop) నుంచి తాను ఈ లస్సి సెంటర్ నిర్వహిస్తున్నానని.. చుట్టుప్రక్కల.. జ్యూస్ షాపులు, సోడా షాపులు వచ్చినా.. తన లస్సి కోసం వచ్చే కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గలేదని అలీ ఖాన్ అంటున్నాడు. సీజన్ బట్టి కాకుండా.. ఇక్కడ 365 రోజులు (Open 365 days) ఈ లస్సి షాప్ తెరిచి ఉంటుంది. అందుకే గత 20 ఏళ్లుగా వరంగల్‌కే ఇది ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిందని చెబుతున్నాడు. అత్తర్ అలీ ఖాన్ తను స్వతహాగా ఇంట్లోనే లస్సికి కావలసిన పదార్ధాలను తయారు చేసుకొని ఇక్కడికి తీసుకు వచ్చి అమ్ముతూ ఉంటాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది.. కస్టమర్స్ తమకు నచ్చిన ఫ్లేవర్ లస్సి (Flavored Lassi)ని ఎంచుకోవచ్చు. ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ కూడా ఇక్కడ లస్సీ లభించడం ఇక్కడి ప్రత్యేకత.
వరంగల్ లస్సిగా ఎంతో ఫేమస్:
కూల్ అండ్ కూల్ (COOL N COOL) లస్సి చిన్నారుల నుంచి పెద్ద వారు వరకు అందరూ ఇష్టంగా తాగుతారు. సాయంత్రం అయ్యిందంటే చాలు ఈప్రాంతమంతా రద్దీగా మారిపోతుంది. సాయంత్రం వేళలో కాలక్షేపానికి బయటికి వచ్చే వాళ్లు, ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఒక్కసారి ఇక్కడ లస్సి (Famous Lassi) తాగారంటే.. వారు మళ్లీ అదే దారిలో వచ్చేటప్పుడు ఆగి మరీ.. లస్సి తాగి.. సేదతీరుతుంటారని అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ COOL N COOL లస్సి పాయింట్ తెరిచే ఉంటుంది.
కూల్ అండ్ కూల్ లస్సి సెంటర్ ఎక్కడ ఉంది:
వరంగల్ జిల్లా (Warangal) గరిమాజీపేట్ పరిధిలోని చార్బౌలి సర్కిల్ వద్ద "మీసేవ" పక్కనే ఈ COOL N COOL లస్సి పాయింట్ ఉంటుంది. వరంగల్ సిటీలో ఎవరిని అడిగినా ఈ లస్సీ పాయింట్ అడ్రస్ చెప్తారు. అంత ఫేమస్ అన్నమాట. ఒకే ప్రదేశంలో 20 సంవత్సరాల నుంచి వ్యాపారాన్ని కొనసాగిస్తుండడంతో ఇదొక ల్యాండ్ మార్క్‌గా ఏర్పడింది. మీరు కూడా ఎపుడైనా వరంగల్ వైపు వెళితే అత్తర్ అలీ ఖాన్ తయారు చేసే కూల్ అండ్ కూల్ లస్సి టేస్ట్ చేయండి.
లస్సి సెంటర్ ఫోన్ నెంబర్ (Phone Number) 7702744610.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Summer, Warangal