Santosh, News18, Warangal
జపాన్ (Japan) దేశానికి చెందిన ఆత్మరక్షణ కళకరాటే. కరాటే (Karate) పుట్టింది జపాన్ దేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నేర్చుకుంటున్నారు. 2015 సంవత్సరంలో కరాటేను ఒలంపిక్ క్రీడగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ (Telangana) లో ప్రతిభ గల కరాటే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఆత్మ రక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. కరాటే ఒక ఆత్మ రక్షణ విద్యల కాకుండా ఒలంపిక్లో కూడా చోటు దక్కించుకుంది. 2015వ సంవత్సరంలో ఈ క్రీడను ఒలంపిక్స్ కమిటీ కరాటేను మెడల్ ఈవెంట్గా గుర్తించడంతో మరింతగుర్తింపు పెరిగింది. కరాటే మూలాలు చాలా పురాతనమైనవి 20వ శతాబ్దంలో జపాన్లో వెలుగులోకి వచ్చిన కరాటేలో మొదటి మూలం కట అని పిలుస్తారు.
విభాగంలో కరాటే ప్లేయర్ సోలోగా ప్రదర్శిస్తాడు.13 సంవత్సరాల వయసులో పిల్లలు సబ్ జూనియర్ గా 14,15 వయసు గలవారూ కడెట్ విభాగంలోనూ 16,17 వయసు గలవరు జూనియర్ విభాగంలో 18 సంవత్సరాలు పైబడినవారు సీనియర్ విభాగాల్లో పోటిపడతారు. గోవాలో జరిగిన అంతర్జాతీయకరాటే పోటీల్లో తెలుగు క్రీడాకారులు సత్తాచాటారు వరంగల్ కేంద్రానికి చెందిన యాకుబ్ పాషా కరాటే కోచ్గాగా నిర్వహిస్తున్నాడు. సుమారు 30 మంది విద్యార్థులు ఇతని వద్ద కోచింగ్ తీసుకున్నారు.
తన వద్ద ఉన్న విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం కోచింగ్ ఇవ్వడంతో పాటు స్టేట్ నేషనల్ టౌర్నమెంట్స్ పోటీలలో పాల్గొంటారు. యాకుబ్ విద్యార్థులు ముగ్గురు ఇటీవల గోవాలో గిరిజన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ చారిబౌలికి చెందిన జ్ఞానేశ్వర్ కరాటే విభాగంలోని స్పారింగ్లో మొదటి స్థానం కాటస్లో మూడవ స్థానంలో పథకం సాధించాడు. తన విద్యార్థి జ్ఞానేశ్వర్ గోల్డ్, బ్రోన్జ్ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు కోచ్.
వరంగల్ చారిబౌలికి చెందిన జ్ఞానేశ్వర్ కిక్ పంచ్ కరాటే నేషనల్ అకాడమీలో గత రెండు సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటున్ననని బ్రౌన్ బెల్ట్ పొందానని ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్పారింగ్లో మొదటి స్తానం, కాటాస్లో మూడవ స్థానంలో బంగారం, బ్రోన్జ్ పతకం సాధించానని తనకి పోటీల్లో రాణించాడనికి ప్రోత్సహించిన తన కోచ్ యాకుబ్ మరియు తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.ఇలాంటి పోటీల్లో పథకాలు మరెన్నో సాధించాలని ఎన్నో సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాని మరింత ముందుకు సాగాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే బాగుటుందనని మెడల్ గ్రహీత జ్ఞానేశ్వర్ అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Warangal