హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్లాస్టిక్ నిషేధంపై పక్కా ప్లాన్.. వరంగల్ పోలీసుల యాక్షన్ షురూ..!

ప్లాస్టిక్ నిషేధంపై పక్కా ప్లాన్.. వరంగల్ పోలీసుల యాక్షన్ షురూ..!

ప్లాస్టిక్ నిషేధంపై వరంగల్ పోలీసుల దృష్టి

ప్లాస్టిక్ నిషేధంపై వరంగల్ పోలీసుల దృష్టి

ఒక వైపు పర్యావణ పరిరక్షణను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని (Plastic Ban) అమలుపరిచింది అధికారులు, పోలీసులు అన్ని చెర్యలు చేపట్టినప్పటికీ కొంతమంది ప్లాస్టిక్ పరిశ్రమల నిర్వాహకులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది విచ్చలవిడిగా ప్లాస్టిక్ ప్లాట్లను ప్లాస్టిక్ గ్లాసులను తయారు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal | Telangana

  Santosh, News18, Warangal

  ఒక వైపు పర్యావణ పరిరక్షణను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని (Plastic Ban) అమలుపరిచింది అధికారులు, పోలీసులు అన్ని చెర్యలు చేపట్టినప్పటికీ కొంతమంది ప్లాస్టిక్ పరిశ్రమల నిర్వాహకులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది విచ్చలవిడిగా ప్లాస్టిక్ ప్లాట్లను ప్లాస్టిక్ గ్లాసులను తయారు చేస్తున్నారు. వరంగల్ సమీపంలోని ఎనుమాముల మార్కెట్ వద్ద SR ఎంట్రప్రెస్స్ ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ ప్లేట్ల పరిశ్రమపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసారు సంఘటన స్థలంలో చాలా పెద్ద మోత్తంలొ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ మరియు ముడి సరుకులు ఉన్నయి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అన్నదని తెలిసికూడా ఎటువంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నడుపుతున్నాడు. సంఘటన స్థలంలో లభించిన సరుకును పరిశ్రమ నిర్వాహకుడు ముదిగొండ రాజు వద్ద నుండి వరంగల్ మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యజమానిపై చర్యల నిమిత్తం పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు టాస్క్ అధికారులు అప్పగించారు .

  టాస్క్ ఫోర్స్ అడిషనల్ డి సి పి వైభవ్ గైక్వాడ్ ఆదేశాలమేరకు ఏ సి పి టాస్క్ ఫోర్స్ జితేందర్ రెడ్డి అధ్వర్యంలో నల్లగట్ల వెంకటేశ్వర్లు,వడ్డె నరేశ్ కుమార్ ఇనస్పెక్టర్స్ వారీ సిబ్బంది తో పక్కా సమాచారం అందడంతో పొల్యూషన్ కంట్రోల్ భోర్డు అధికారులు, వరంగల్ మున్సిపాలిటి అధికారులతో కలిసి దాడి చేసారు.

  ఇది చదవండి: ఫారెస్ట్ రేంజర్ హత్య.. ఎవరు చంపారో తెలుసా..? పోలీసులేమంటున్నారు..?

  ప్రభుత్వా నిబంధనలకీ విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడటం కానీ, తయారు చేస్తున్నారని మాకు సమాచారం వస్తె కటినమైనా చర్యలు తీసుకుంటామని శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐ పి ఎస్ అడిషనల్ డి సి పి టాస్క్ ఫోర్స్ గారు హెచ్చరించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సోమలిగం, మాధవ రెడ్డి కానిస్టేబుల్ అలీ, రాజు రాజేష్, బిక్షపతి, శ్రీనివాస్ లు కూడా పాల్గొన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Plastic Ban, Telangana, Warangal