హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఒకరు టెన్త్ పాస్.. మరొకరు ఫెయిల్.. కట్ చేస్తే 25 ఏళ్లుగా ఫేమస్ ఆయుర్వేద వైద్యులు.. ఆ మ్యాజిక్ ఏంటోమరి

ఒకరు టెన్త్ పాస్.. మరొకరు ఫెయిల్.. కట్ చేస్తే 25 ఏళ్లుగా ఫేమస్ ఆయుర్వేద వైద్యులు.. ఆ మ్యాజిక్ ఏంటోమరి

వరంగల్‌లో నకిలీ డాక్టర్ల అరెస్ట్

వరంగల్‌లో నకిలీ డాక్టర్ల అరెస్ట్

Warangal: ఒకరు పదో తరగతి పాస్. ఇంకొకరు పదో తరగతి ఫెయిల్. కట్ చేస్తే.. వాళ్లిద్దరూ వరంగల్ (Warangal) నగరంలో ఆయుర్వేద వైద్యంలో పేరు మోసిన వైద్యులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  ఒకరు పదో తరగతి పాస్. ఇంకొకరు పదో తరగతి ఫెయిల్. కానీ వీరిద్దరూ ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాళ్లిద్దరూ వరంగల్ (Warangal) నగరంలో ఆయుర్వేద వైద్యంలో పేరు మోసిన వైద్యులు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం సామాన్య ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకున్న వైనం వీరి వ్యాపారం ఎలా నడిచింది అంటే మూడు సూదులు ఆరు గోలీలు అన్న చందంగా సాగిపోతుంది. 25 సంవత్సరాల నుంచి వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలను నకిలీ వైద్యంతో మోసం చేస్తున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హనుమకొండ హంటర్ రోడ్డు కు చెందిన ఇమ్మడి క్రాంతికుమార్ పదవ తరగతి పాస్ అయ్యాడు, వరంగల్ చార్ బౌలికి చెందిన మహమ్మద్ రఫీ పదో తరగతి ఫెయిల్ అయ్యాడు కానీ వీరిద్దరూ 1990వ దశకంలో ఒక పేరు మోసిన వైద్యుడి దగ్గర సహాయకుడిగా చేరారు. వైద్యం నేర్చుకునే వరకు అక్కడే కిక్కుమనకుండా సేవలు అందించారు అనంతరం వైద్యుడిగా మారితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశ పుట్టింది. మరి రోగులకు వైద్యం చేయాలన్న ఆసుపత్రి నిర్వహించాలన్న ధ్రువీకరణ పత్రాలు చదువుకు సంబంధించిన నకిలీ పత్రాలు ఎలా సంపాదించాలి అని ఆలోచించారు.

  ఇది చదవండి: లక్కీ స్కీమ్ పేరుతో రూ. 3 కోట్లు కొల్లగొట్టారు.., పేదల నోట్లో మట్టికొట్టారు

  బీహార్ లోనీ దేవఘర్ విద్యాపీఠ విశ్వవిద్యాలయం నుంచి ఆయుర్వేదం విద్య పూర్తి చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలను గుర్తింపు కార్డులను సృష్టించారు. ఇంకేముంది ఆస్పత్రులు తెరవడమే తరువాయి వెంటనే ఇద్దరు వేరువేరుగా ఇమ్మడి క్రాంతి కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో మహమ్మద్ రఫీ సలీమా పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ ముసుగులోనే 25 సంవత్సరాలుగా రోగులకు వైద్యం చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు పరిస్థితి చేయి జారిందంటే వెంటనే పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించేవారు.

  ఈ ఇద్దరి కేటు డాక్టర్ల గురించి పోలీసులకు సమాచారం అందంగానే రంగంలోకి దిగిన వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి నకిలీ వైద్య ధ్రువపత్రాలు, 1.28 లక్షల నగదును వైద్య పరికరాలతో పాటు మందులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నకిలీ డాక్టర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ పోలీసులను సిబ్బందిని వరంగల్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Warangal

  ఉత్తమ కథలు