హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: హనుమకొండలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు!

Warangal: హనుమకొండలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు!

X
తలపడుతున్న

తలపడుతున్న ప్లేయర్స్

Warangal: విద్యార్థుల్లో క్రీడలపై అవగాహన పెరిగింది. తల్లిదండ్రులప్రోత్సాహం స్పాన్సర్ల సహకారంతో పాటు ప్రభుత్వ చొరవ కారణంగా యువకులు క్రీడలలో రాణిస్తున్నారు. చదువులకే పరిమితం కాకుండా ఇష్టమైన క్రీడలలో ప్రావీణ్యం సాగిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

విద్యార్థుల్లో క్రీడలపై అవగాహన పెరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం స్పాన్సర్ల సహకారంతో పాటు ప్రభుత్వ చొరవ కారణంగా యువకులు క్రీడలలో రాణిస్తున్నారు. చదువులకే పరిమితం కాకుండా ఇష్టమైన క్రీడలలో ప్రావీణ్యం సాగిస్తున్నారు.

ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ బాక్సింగ్ క్రీడ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కష్టమైన క్రీడలో ఆటగాళ్లు ప్రత్యర్థులపై పంచులు విసురుతూ సత్తా చాటుతున్నారు. బాక్సింగ్ అంటే కొంచెం కష్టమే.. ప్రత్యర్థి పంచుల ద్వారా గాయాల పాలవుతారని కొంతమంది ఈ ఆటపై ఆసక్తి చూపేవారు.అయితే పరిస్థితి మారింది.. సాహస క్రీడల్లో ఒకటైన బాక్సింగ్ లో యువకులు పోటీ పోటీ పడుతున్నారు.

అందులో భాగంగా హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ఆసక్తిగా జరుగుతున్నాయి. బాక్సింగ్ విభాగాల్లో బాక్సర్లు ప్రతిభను కనబరుస్తున్నారు. జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొన్న వారు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక ప్రాంతాల నుండి బాక్సర్లు ప్రతిభను కనబరుస్తున్నారని.. ఆయా ప్రదేశాల నుండి సంఘాలు బాక్సింగ్ క్లబ్బుల సహకారంతో ఆటగాళ్లు తయారవుతున్నారని శిక్షకులు అంటున్నారు.

s

హనుమకొండ కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి అండర్ 16 పోటీల్లో పాల్గొన్న వారు హైదరాబాద్ లో రెండు రోజులు నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికైన బాక్సర్లు పాట్నాలో మూడు రోజులపాటు జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గతంలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా బాక్సింగ్ పోటీల్లో ముగ్గురు మహిళలు జాతీయస్థాయిలో ఎంపికయ్యారని.. పురుషులతోపాటు మహిళలు కూడా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నారని.. వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ రాములు చెప్పారు.

హనుమకొండలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకుని వస్తానని బాక్సర్ ఆకాష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చిన్ననాటి నుండే తనకు బాక్సింగ్ పై ఆసక్తి ఉండడం వలన ఈ పోటీల్లో పాల్గొంటున్నానని ఆకాష్ చెప్పారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు