హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి!

Warangal: వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి!

X
రోడ్డు

రోడ్డు ప్రమాదాలు

Warangal: ఈ ఐదు కిలోమీటర్లలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఏదైనా శక్తి ఉందా? వరంగల్ ఖమ్మం హైవేలో ఆదమరిస్తే జీవితాలు అంతే. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై తన వాహనాలను రైమనిపించే వాహన చోదకులు ఇక్కడ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఈ ఐదు కిలోమీటర్లలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఏదైనా శక్తి ఉందా? వరంగల్ ఖమ్మం హైవేలో ఆదమరిస్తే జీవితాలు అంతే. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై తన వాహనాలను రైమనిపించే వాహన చోదకులు ఇక్కడ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే రోడ్డు పక్కనే హోటల్లు, వైన్ షాప్ ల వద్ద నిర్లక్ష్యంగా నిలిపివేసే వాహనాలు కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సంఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ ఆర్టిఏ చౌరస్తా నుంచి అయినవోలు క్రాస్ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారి పరిస్థితిపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.

వరంగల్ ఆర్టిఏ కార్యాలయం నాయుడు పెట్రోల్ బంక్ పక్కనే హోటల్లు, వైన్ షాప్ ఉండడంతో వాహనాలను కొందరు హైవేపైనే నిర్లక్ష్యంగా నిలిపిస్తారు. చీకట్లో ఈ వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఏ కార్యాలయం జంక్షన్ నుండి అయినవోలు ఎక్స్ రోడ్ వరకు వైన్ షాపులు, హోటల్స్, పెట్రోల్ బంకులు ఉంటాయి. ఈ రహదారి వెంబడి లారీలకు సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా లేదా రోడ్డుపైనే వాహనాలు నిలపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్టిఏ చౌరస్తా నుండి అయినవోలు క్రాస్ వరకు ఐదు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఈ జాతీయ రహదారిపై పోలీసులు రికార్డుల ప్రకారం ఈ మధ్యనే సుమారు 40 నుండి 50 ప్రమాదలు జరిగాయి. హైవేపై ప్రధానంగా నాయుడు పెట్రోల్ బంక్, అండర్ రోడ్, తిమ్మాపురం క్రాస్ రోడ్డు, టిఎస్పిఎస్సి బెటాలియన్ ప్రధాన గేటు ఎదుట, మామునూరు చెరువు కట్ట, వాగ్దేవి కళాశాల సమీపం, బొల్లికుంట క్రాస్ రోడ్డు, అయినవోలు క్రాస్ రోడ్డులో డేంజర్ ఏరియాగా గుర్తించారు. ఈ స్థలాలలో సుమారు 50కి పైగా తీవ్ర గాయాల పాలైన వారు ఉండగా తొమ్మిది మంది వరకు మరణించారు.

రహదారి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న నడకదారిని ఆక్రమించి వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం, ఇతర వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల పాదచారులు ప్రధాన రహదారిపై వెళ్తుండగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ స్థలం మామునూరు పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉంటుంది. లారీలు పూర్తిగా ఆక్రమించినా అధికారులు పట్టించుకోవడంలేదు. వరంగల్ ఖమ్మం రహదారి నుంచి అయినవోలు జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో రాత్రివేళ రహదారి చీకటి మయంగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Shocking: చెత్తను వీధుల్లో వేసే వారికి షాక్.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే రూ. లక్ష ఫైన్.. ఎక్కడంటే..

ఒకపక్క లైటింగ్ లేకపోవడం మరొక పక్క లారీల పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. జాతీయ రహదారి కావడంతో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. రాత్రిపూట విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. చీకటి పడిన తర్వాత రహదారిపై అంధకారం అలుముకుంటుందని, ప్రాణాలను సైతం అరిచేతిలో పెట్టుకొని భయంగా ప్రయాణిస్తున్నామని వాహనదారులు అంటున్నారు. నగర పరిధిలో హైవేపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలతో అధికారులు సరిపెడుతున్నారని.. ఆచరణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే అసలు ఈ ఐదు కిలోమీటర్ల వ్యవధిలో ఏం జరుగుతుందోనని.. ఏదైనా శక్తి ఉందా అని కొందరు అనుమానిస్తున్నారు. తక్షణమే ప్రజా శ్రేయస్సుకై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal