Santosh, News18, Warangal
వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal Police Commissioner) గా ఏవి రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన వర్క్ స్టైల్ ను చూపిస్తున్నారు. అవినీతి, అక్రమాలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారికి నిజమైన నాలుగో సింహంలో వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అనైతిక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని పోలీస్ శాఖపై ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని పెంపిందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ట్రాఫిక్ పోలీసు తనకు కేటాయించిన సెంటర్లలో విధులు సక్రమంగా నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలే తలెత్తవని భావించి అందుకు అనుగుణంగా సిబ్బందిలో మార్పు తీసుకువచ్చారు. ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందిన సిపి రంగనాథ్ ప్రక్షాళనను పోలీసు శాఖ నుంచే మొదలుపెట్టారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపై ప్రతిక్షణం నిఘా ఉంచుతున్నారు. డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐల పనితీరుపై ఆరా తీస్తున్నారు. పోలీస్ శాఖ పరువు తీస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఏ స్థాయిలో ఉన్నా అవినీతి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. భూ దందాలు, వసూళ్లు, సెటిల్మెంట్ లకు పాల్పడుతున్న అధికారులపై అంతర్గత విచారణకు సైతం ఆదేశించడంతోపాటు సెటిల్మెంట్లు జోక్యం చేసుకుంటే హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఫాలో కావాలని సూచిస్తున్నారు.
శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యాత్మక ప్రాంత ప్రజలను నేరుగా కలిసి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీబీ, బీసీపీల ద్వారా పరిష్కారం సమస్య ఏదైనా ఉంటే తనకు నేరుగా ఎస్ఎంఎస్ చేయవచ్చు అంటూ హామీ ఇస్తున్నారు. అదేవిధంగా కమిషనరేట్ కున్న ఫేస్బుక్ ఎకౌంట్ కూడా తమ సమస్యలను పోస్ట్ చేయవచ్చు అంటున్నారు. దీంతో సీపీ రంగనాథ్ పై ప్రజలకు నమ్మకం కుదురుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal