హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: హెచ్ఆర్సీ పేరుతో ఫోన్ కాల్.. ఆరా తీసి షాకైన పోలీసులు..

Warangal: హెచ్ఆర్సీ పేరుతో ఫోన్ కాల్.. ఆరా తీసి షాకైన పోలీసులు..

వరంగల్‌లో చీటింగ్ గ్యాంగ్ అరెస్ట్

వరంగల్‌లో చీటింగ్ గ్యాంగ్ అరెస్ట్

Warangal: సమాచంలో మోసపోయేవాళ్లున్నంతకాలం.. మోసగాళ్ల దందాలు సాగుతూనే ఉంటాయి. మాటల్లో పెట్టి మాయ చేస్తే ఎంత చదువుకున్నవాళ్లయినా ఇట్టే బుట్టలో పడతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

సమాజంలో మోసపోయేవాళ్లున్నంతకాలం.. మోసగాళ్ల దందాలు సాగుతూనే ఉంటాయి. మాటల్లో పెట్టి మాయ చేస్తే ఎంత చదువుకున్నవాళ్లయినా ఇట్టే బుట్టలో పడతారు. పోలీసులంటూ, ఐఏఎస్ లమంటూ, హెచ్ఆర్సీ ప్రతినిథులమంటూ బ్లాక్ మెయిల్ చేసే కేటుగాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. తాజాగా జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) పేరుతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగును గుర్తించి చెరసాలకు పంపించారు వరంగల్ (Warangal) పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. తొర్రూరు మండలానికి చెందిన క్రాంతి జ్యోతి రమణ, హ్యూమన్ రైట్ రాష్ట్ర గవర్నర్ అనే పేరుతో ఓ మహిళతో కలిసి కొంత మంది‌ ముఠాగా ఏర్పడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

ఓ రోజు సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో పెద్దమ్మ గడ్డలో భీమా భీమయ్య అనుమానస్పదంగా చనిపోయాడని బంధువులు ధర్నా చేస్తుండగా పోలీసులు శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి పంపించే క్రమంలో జన్ను రాజు అనే వ్యక్తి హనుమకొండ ఎస్సై రాజుకు ఫోన్ చేసి హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ మాట్లాడతాడని వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఇవ్వగా.. నిందితుడు క్రాంతి ఎస్సైని ఇష్టం వచ్చినట్లు దూషించి, బెదిరించాడు. ఈ విషయమై ఎస్సై రాజు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా క్రాంతి కుమార్ నేర స్వభావము కలిగి ఉండి గతంలో కూడా చిలకలగూడ, బోయినపల్లి పోలీస్ స్టేషన్లోకేసులు నమోదైనట్లు తెలిసింది.

ఇది చదవండి: కాంట్రాక్ట్ కష్టాలు..! చేసేది కరెంట్ పని.. ఐనా జీవితాల్లో వెలుగేది..?

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరు చెప్పి క్రాంతి కుమార్, బుంగ జ్యోతి, రమణ, రవి సంజయ్ అడ్వకేట్ లు గ్యాంగ్ గా మారి నేషనల్ హ్యూమన్ రైట్ మెంబెర్స్ అని, జర్నలిస్ట్ లము అని, గిన్నీస్ బుక్ వరల్డ్ కో ఆర్డినేట్లం అని, హైకోర్ట్ అడ్వకెట్ అని, సీనియర్ IAS, IPS అధికారులకు ఫోన్లు చేసి భూతులు మాట్లాడుతూ.. వాయిస్ రికార్డులను, పోస్ట్ చేస్తూ బెదిరించారు. గవర్నర్, సెక్రెటరీ శర్మ పేరు చెపుతూ భూముల తగాదాలలో తల దూర్చి బెదిరించే వారు.

ఇది చదవండి: అధిక వడ్డీ వసూలు చేశారో జాగ్రత్త.. కలకలం రేపుతున్న పోస్టర్లు

ఈ విషయంలో అడ్వొకేట్ రవి సంజయ్ పై ఇబ్రహీం పట్నం PSలో, CCS హైదరాబాద్‌ (Hyderabad) లో, రాజపేటలో, మేడ్చల్ పీఎస్ లో, చిలకలగూడ పీఎస్ లో పోలీసు విధులను అడ్డుకోవడం, వారి పైకి కుక్కలను ఉసి గొలిపి గాయపరచడంమొదలైన కేసులు నమోదయ్యాయి. వీరంతా కలిసి భూతగాదాల సెటిల్మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తేలింది. పోలీసులను బూతులు తిట్టి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ, మహిళలకు అసభ్యకరంగా పంపించిన మెసేజ్లు, మత్తుమందు ఏ విధంగా వాడాలో తెలియజేసే విషయాలు చాలామంది మహిళలకు పంపిన క్రాంతి మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు