Home /News /telangana /

WARANGAL WARANGAL POLICE ARRESTED A FAKE DOCTOR WHO TREATED THOUSANDS OF PEOPLE SNR

Fake Doctor : 43వేల మందికి ట్రీట్‌మెంట్ చేసిన సింగిల్ డాక్టర్ .. అతనే వరంగల్‌ శంకర్‌దాదా MBBS

(WARANGAL FAKE DOCTOR)

(WARANGAL FAKE DOCTOR)

Fake Doctor: వైద్యశాస్త్రం చదువుకోకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్నారు కొందరు ప్రబుద్ధులు. చదవితే కాదు చూస్తేనే వైద్యం వస్తుంది అన్నట్లుగా మారిపోయింది కొందరు నకిలీ డాక్టర్ల వ్యవహారం. వరంగల్‌లో అలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ని పోలీసులు పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
వైద్యశాస్త్రం చదువుకోకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్నారు కొందరు ప్రబుద్ధులు. చదవితే కాదు చూస్తేనే వైద్యం వస్తుంది అన్నట్లుగా మారిపోయింది కొందరు నకిలీ డాక్టర్ల(Fake doctor)వ్యవహారం. నాలుగు సంవత్సరాల ప్రాక్టీస్‌లో 43వేల మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్(Treatment)చేశాడు. అందరూ గొప్ప డాక్టర్, మంచి చేయి తిరిగిన వైద్యుడు అనుకున్నారు. పోలీసులకు అతనిపై డౌట్ రావడంతో అతను డాక్టర్ కాదని శంకర్‌దాదా ఎంబీబీఎస్‌(Shankardada MBBS)అని తేల్చారు.

Hyderabad : హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు ..ఎప్పటి వరకు అంటే..?



చదువు మధ్యలో ఆపేసి..
వరంగల్‌లో ఫేమస్‌ డాక్టర్‌గా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడి గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరానికి చెందిన ముజతబా అహ్మద్ అనే వ్యక్తి బీ ఫార్మసీ మధ్యలోనే ఆపేసి ఓ డాక్టర్ దగ్గర చేరిపోయాడు. డాక్టర్ ఇచ్చే జీతం చాలకపోవడం, రోజూ డాక్టర్‌కి వచ్చే ఆదాయం చూసి తాను కూడా డాక్టర్‌గా మారిపోవాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే ఎయిమ్స్‌ నుంచి ఫేక్ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్ పుట్టించుకొని 2018లో చింతల్ ప్రాంతంలోనే హాస్పిటల్ హెల్త్ కేర్ ఫార్మసీని తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి అహ్మద్ బిజినెస్ జోరు అందుకుంది. ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి సంతోష్‌ కుమార్ అనే వ్యక్తిని అడ్డుపెట్టుకొని అవసరం లేని టెస్ట్‌లు చేస్తూ..అదనంగా మందులు రాస్తూ డబ్బుల రూపంలో పేషెంట్ల రక్తం తాగాడు నకిలీ డాక్టర్ అహ్మద్.



దొంగ సర్టిఫికెట్‌తో వైద్యం..
ఒకటి రెండు కాదు ఈ విధంగా నాలుగేళ్లు డాక్టర్ ముసుగు వేసుకొని సుమారు 43వేల మంది రోగులకు ట్రీట్‌మెంట్ చేశాడు. ఎలాంటి విద్యార్హత లేదు. వైద్యశాస్త్రంలో అనుభవం లేకుండానే తనకు వచ్చినట్లుగా వైద్యం చేస్తూ ల్యాబ్‌ టెక్నిషియన్ చెప్పినట్లుగా మందులు రాస్తూ సూపర్ డాక్టర్‌గా మేనేజ్ చేస్తూ వచ్చాడు అహ్మద్. ఏదైనా సీరియస్ కేసులు వస్తే వేరే ఆసుపత్రికి రెఫర్ చేసి పెద్ద మొత్తంలో కమిషన్‌లు కూడా దండుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అహ్మద్ క్లీనిక్‌లో తనిఖీలు నిర్వహించడంతో బండారం బయటపడింది.

Telangana : జాతీయ జెండా మార్ఫింగ్ చేసి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రచారం..మండిపడుతున్న దేశభక్తులు



4ఏళ్లలో 43మందికి ట్రీట్‌మెంట్..
డూప్లికేట్ డాక్టర్ ముజతబా అహ్మద్‌తో పాటు అతడికి సహాకరిస్తున్న ల్యాబ్ టెక్నిషియన్ సంతోష్‌ కుమార్‌ను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని సర్టిఫికెట్లు పరిశీలించడంతో నిజం ఒప్పుకున్నారు. ఇద్దర్ని బుధవారం అరెస్ట్ చేసిన వరంగల్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు 1.90 లక్షల నగదుతో పాటు ఓ ల్యాప్‌టాప్, ల్యాబ్ పరికరాలు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లుగా వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి చెప్పారు. కేవలం నాలుగేళ్ల ప్రాక్టీస్‌లో 43వేల మందికి ట్రీట్‌మెంట్ చేసినట్లుగా తెలుసుకున్న పోలీసుల నకిలీ డాక్టర్ గురించి పూర్తి వివరాలు రాబడుతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులిద్దరిని మిల్స్‌ కాలనీ పోలీసులకు అప్పగించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana crime news, Warangal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు