నకిలీ నోట్ల (Fake currency) తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను వరంగల్ (Warangal) టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి రూ.6.లక్షలనకిలీ నోట్లు ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు,స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ సీపీ తరుణ్‌జోషి వివరాల ప్రకారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకూబ్, పేరాల అవినాష్, మచిలీబజార్‌కు చెందిన. ఎండీ అక్రం అలీ, కాపువాడకు చెందిన. కత్తి సునీత, సోహల్, వరంగల్ జిల్లా నర్సంపేట రాజీవ్‌నగర్‌కు చెందిన కత్తి రమేశ్(24)కాజీపేట చింతల్ బస్తీకి చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్ల రజినీలను పోలీసులు అరెస్టు చేయగా..న్యూరాయపురకు చెందిన ఎండీ సమీర్ పరారీలో ఉన్నాడు.
జైలులో వరిచయం సయ్యద్ యాకూబ్, గడ్డం ప్రవీణ్, గుండా రజిని గతంలో కిద్నాప్ కేసులో రామగుండం సబ్‌జైలులో శిక్ష అనుభవించే సమయంలో అక్కడ నకిలీ కరెన్సీ తయారు చేసే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారి నుంచి కరెన్సీ ముద్రించే విధానం గురించి తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మిగిలిన నిందితులతో కలిసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేశారు.
నిందితులు రూ.2వేల నోటు తయారు చేసేందుకు వినియోగించే కాగితాన్ని యూట్యూబ్‌లో చూసి కొనుగోలుచేశారు. ఎవరికి అనుమానం రాకుండా రద్దీ ఎక్కువగా ఉండే వ్యాపార ప్రాంతాల్లో వీటిని చలామణి చేసేవారు.గతేడాది వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్ఫీని చలామణీ చేశారు. ఇలా వచ్చిన డబ్బులతో నిందితులు జల్సాలు చేసేవారు. అవినాష్ సుబేదారిలోని తిరుమల బార్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా. నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. అవినాష్ ఇచ్చిన సమాచారంతో మిగతావారు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 6 లక్షలు నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్భిన టాస్క్‌ఫోర్స్ అడిషనల్డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్‌రెడ్డి. ఇన్స్పెక్టరు వెంకటేశ్వర్లు.వడ్డే నరేశ్పమార్, ఎస్సైలు నిస్సార్‌పాషా,ఎస్సై రవికిరణ్ లను సీపీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal