హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: అర్ధరాత్రి బయటికెళ్లాలంటే హడల్.. వణికిపోతున్న జనం..! కారణం ఇదే..!

Warangal: అర్ధరాత్రి బయటికెళ్లాలంటే హడల్.. వణికిపోతున్న జనం..! కారణం ఇదే..!

వరంగల్‌లో ప్రమాదకరంగా గ్రానైట్ లారీలు

వరంగల్‌లో ప్రమాదకరంగా గ్రానైట్ లారీలు

రోడ్డు మీదకు వెళ్లినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటివారు కూడా అంతే జాగ్రత్తగా వెళ్లాలి. కానీ తెలంగాణ (Telangana) లోని ముఖ్యనగరమైన వరంగల్ లో మాత్రం అర్ధరాత్రి బయటకు వెళ్తే.. మృత్యువుకు ఎదురెళ్లినట్లేనన్న భావన కలుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

రోడ్డు మీదకు వెళ్లినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటివారు కూడా అంతే జాగ్రత్తగా వెళ్లాలి. కానీ తెలంగాణ (Telangana) లోని ముఖ్యనగరమైన వరంగల్ లో మాత్రం అర్ధరాత్రి బయటకు వెళ్తే.. మృత్యువుకు ఎదురెళ్లినట్లేనన్న భావన కలుగుతోంది. అర్ధరాత్రి అయిందంటే చాలు వరంగల్ (Warangal) మహానగరంలో లారీలదే హల్ చల్. కరీంనగర్ నుంచి వరంగల్ మీదుగా వందల సంఖ్యలో గ్రానైట్ లారీలు ఖమ్మం (Khammam) వైపుగా వెళ్తుంటాయి. కాళేశ్వరం నుండి ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో హనుమకొండ, కాజీపేట, జనగాం మీదుగా హైదరాబాద్ (Hyderabad) పోతూ ఉంటాయి. ఇసుక లారీలు, గ్రానైట్ లారీలు ఓవర్ లోడ్ తో స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయి. దీంతో రోడ్డుపై తిరగాలంటే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ లారీ ఎప్పుడు మీదికి దూసుకొస్తుందని భయంతో వాహనం నడపాల్సి వస్తుంది వాహనదారులు.

గ్రానైట్ ఇసుక లారీల ఓవర్ లోడ్ తో తిరగడంతో రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. రోడ్డుపై దుమ్ము లేవడంతో రాత్రిపూట ఆటోలు, బైక్ పై వెళ్లే వారికి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల కాలంలో గ్రానైట్ బండ రాయి ఆటోపై పడగా ముగ్గురు మృతి చెందారు. మరోసారి వరంగల్లోని హంటర్ రోడ్ లో గ్రానైట్ రాయి బైక్పై వెళ్తున్న వారి మీద పడగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్లు వాహనాలను స్పీడుగా నడుపుతూ ఢీ కొట్టి వెళ్ళిపోతున్నారు.

ఇది చదవండి: ఇది రైతు బజార్ అంటే నమ్ముతారా.. వైన్ షాప్ కంటే దారుణం

రవాణా శాఖ అధికారుల నిబంధనల ప్రకారం ఆరు చక్రాల లారీపై 16 టన్నుల బరువు తీసుకువెళ్లాలి. పది చక్రాల వాహనాలు 25 టన్నులు, 12 చక్రాల వాహనాలు 35 టన్నుల వరకు తీసుకువెళ్లొచ్చు. ఇసుక లారీలు మాత్రం దానికి మించి ఓవర్ లోడ్ తో తీసుకు వెళుతున్నారు. గ్రానైట్ రాయిని లారీపై తీసుకు వెళుతున్నప్పుడు కదలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ విషయాన్ని లారీ యజమానులు పట్టించుకోవడం లేదు.

కరీంనగర్ నుండి వచ్చే గ్రానైట్ లారీలు ఎలుకతుర్తి, హసన్పర్తి, వరంగల్ నగరం మీదుగా ఖమ్మంకు వెళ్తుంటాయి. ఈ రహదారిలో 30 టన్నుల వాహనాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 52 టన్నుల సామర్థ్యం గల వాహనాలు నడుస్తున్నాయి. దానితో రోడ్లన్నీ పాడవుతున్నాయి అంటున్నారు ప్రజలు. ఒకేరోజు వందల లారీలు ఒకేసారి వెళ్లడంతో వాటి వెనకాల, ముందు వెళ్లాలన్న భయమేస్తుంది అంటున్నారు ప్రజలు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఆర్టిఏ అధికారులు, పోలీసు అధికారులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నారని అంటున్నారు ప్రజలు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు