Santhosh, News 18, Warangal
చుట్టూ చీకటే అని తలచుకొని బాధపడుతూ కూర్చోలేదు.. కళ్లు లేవని కలత చెందలేదు. తనను విధి వెక్కిరించినా, చెవులే కళ్ళుగా చేసుకొని ఆటో మెకొనిక్గా నిశ్చింతగా జీవనం సాగిస్తూ ఎందరికోస్ఫూర్తిగా నిలిచారు. వరంగల్ కాశీబుగ్గకు చెందిన హఫీజ్. వరంగల్ ఆటోనగర్‌లో ఎలట్టీషియన్గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఎడమ కన్ను కోల్పోయారు.
అధైర్యం చెందక తన వృత్తిని కొనసాగించారు. టపాసుల వల్ల లేచిన నిప్పురవ్వలతో కుడి కన్ను పోయింది. జీవితం నిండా కారుచీకటి నిండిందని భయపడక వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, దాతలు ఓ అటో కొనివ్వగా, ఆటోను అద్దెకిచ్చుకుంటూ వచ్చే కొద్దిపాటి సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు . తరచూ ఆటోకు మరమ్మతులు వచ్చేవి. ఆద్జెపై వచ్చే ఆదాయం మరమ్మతులకే పోయేది.
అప్పుడు తనకున్న ఎలక్టీషియన్ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనాల మరమృతులు ఆరంభించారు. వాహనం నుంచి బండిలోని లోపాన్ని మరమ్మతులు చేస్తున్న హఫీజ్ పరిజ్ఞానాన్ని గుర్తించిన వాహనదారులంతా కడుతున్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఉపాధి రుణం అందిస్తే పూర్తి స్థాయి మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకుని మరి కొందరికి ఉపాధి చూపగలనంటున్నారు హఫీజ్.
మొదట 2003 సంవత్సరంలో ఒక కన్ను 2005 సంవత్సరంలో మరొక కన్నును దీపావళి టపాసులు నిప్పు రవ్వలు కంటిలో పడి పాడవడంతో రెండు కళ్ళని కోల్పోపోయారు. కళ్ళు కోల్పోపోయిన సమయంలో తన ఇద్దరు పిల్లలు చిన్నవారే, కూతురికి ఐదు సంవత్సరాలు కుమారుడికి నాలుగు సంవత్సరాలు ఉన్నాయట. తన పిల్లలని చూసి సుమారు పదహారు సంవత్సరాలు గడుస్తున్నాయని కన్నీరు పెట్టుకుంది తన భార్య. తనకి రెండు కళ్ళు లేకపోయినా కుటుంబం కోసం ఎంతో కష్టపడతాడని తనని చూసి గర్వపడతానని కానీ అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుందని.. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుతున్నారని.. ఎవరైనా తమని ఆదుకుంటే తన భర్త మరింత అభివృద్ధి సాధిస్తాడని తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది హఫీజ్ భార్య నజీమా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal