హోమ్ /వార్తలు /తెలంగాణ /

కీలక ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనా.. వరంగల్ ప్రజలకు కష్టాలు తప్పవా..?

కీలక ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనా.. వరంగల్ ప్రజలకు కష్టాలు తప్పవా..?

X
అటకెక్కిన

అటకెక్కిన వరంగల్ నియో మెట్రో ప్రాజెక్టు

వరంగల్ (Warangal) మహానగరంలో ఒకప్పుడు 200 సిటీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది. దీనితో ప్రజలు ఆటోలపై, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. సుమారు 5 లక్షల వాహనాల వరకు సొంత వాహనాలు ఉన్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

వరంగల్ (Warangal) మహానగరంలో ఒకప్పుడు 200 సిటీ బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది. దీనితో ప్రజలు ఆటోలపై, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. సుమారు 5 లక్షల వాహనాల వరకు సొంత వాహనాలు ఉన్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా సేఫ్టీ ప్రయాణం కోసం రెండు సంవత్సరాల క్రితం మెట్రో రైలు ప్రతిపాదనలు జరిగాయి. ఈ నియో మెట్రో రైల్ పై అనేకసార్లు చర్చలు కూడా జరిగాయి. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి హనుమకొండ, హనుమకొండ చౌరస్తా నుండి ములుగు రోడ్డు, ఎంజిఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకటరామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు.. వరంగల్ స్టేషన్ మీదుగా జేబీఎన్ రోడ్ వైపు పోచమ్మ మైదానం వరకు ప్రధాన రహదారి వెంట మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు.

మెట్రో నగరాలపై పాలకవర్గం అప్పటి GWMC కమిషనర్ ఆధ్వర్యంలో మీటింగ్లు కూడా నిర్వహించారు. మెట్రో రైల్ కార్పొరేషన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. గతంలో 15 కిలోమీటర్ల మెట్రో రైలు హైదరాబాద్ తరహాలో ఆకాశమార్గంలో నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత మార్పులతో కొత్త డిపిఆర్ ను నాసిక్, నాగపూర్ తరహాలో ప్రాజెక్టు తయారు చేశారు. కొత్త విధానంలో నిర్మాణ వ్యయంతో పాటు నిర్వాహన ఖర్చు తగ్గించాలని ఏడు కిలోమీటర్ల రోడ్డు మార్గంలో మరో ఎనిమిది కిలోమీటర్లు ఆకాశమార్గంలో మెట్రో చేసేలా ఈ డిపిఆర్ ను సిద్ధం చేశారు.

ఇది చదవండి: కళ్ల ముంగిటే కల.. ఓరుగల్లు వాసుల ఆశలు నెరవేరేనా..?

మహారాష్ట్ర మెట్రో రైల్ సంస్థ తయారుచేసిన నియోమెట్రో వరంగల్ కొత్త డిపిఆర్ ను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి 2020 సంవత్సరం మార్చి నెలలో సమర్పించింది. ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. రెండు దశల్లో ఈ నియో మెట్రో రైల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో కాజీపేట నుండి వరంగల్ వరకు 21 స్టేషన్లో.. రెండో దశలో మడికొండ నుండి ఖమ్మం హైవే మార్గం నుండి మామునూరు వైపు నర్సంపేట మార్గం నుండి ధర్మారం వైపు మెట్రో విస్తరణ చేయాలని ప్రాజెక్టును ప్రతిపాదించారు.

ఇది చదవండి: యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్..! ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే.!

తొలి దశలో ఒక వెయ్యి 30 కోట్లు అంచనా అవుతుందని అంచనాలు వేశారు. ఇందులో ఐదు శాతం మున్సిపల్ కార్పొరేషన్ మిగతాది మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. మెట్రో రైలుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని తెలిపింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే మెట్రో రైలు పనులు కావడంలేదని అంటున్నారు నగర ప్రజలు.

వరంగల్ మహానగరం అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనికి వచ్చేటువంటి ప్రాజెక్టులను వెంటనే పనులు మొదలు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా పనులు పూర్తి చేయాలని, నత్తనడకల సాగకూడదని వరంగల్ నగరానికి వచ్చేటువంటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమేనని సామాజిక కార్యకర్త డాక్టర్ తిరునాహరి శేషు అంటున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు