హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: దేశ వ్యాప్త చేనేత వస్త్రాలు.. రూ.1000 నుండి ప్రారంభం

Warangal: దేశ వ్యాప్త చేనేత వస్త్రాలు.. రూ.1000 నుండి ప్రారంభం

X
తక్కువ

తక్కువ ధరకే చేనేత వస్త్రాలు

Warangal: త్వరలోనే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి అంటే అమ్మాయిలకు మొట్టమొదట గుర్తొచ్చేది చీరలో ఎన్నో రకాలు ఎన్నో డిజైన్స్ సరికొత్త కలెక్షన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

త్వరలోనే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి అంటే అమ్మాయిలకు మొట్టమొదట గుర్తొచ్చేది చీరలో ఎన్నో రకాలు ఎన్నో డిజైన్స్ సరికొత్త కలెక్షన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలి ఏ ఏ షాపులు తిరగాలి.. అసలు ఎక్కడ బాగుంటాయి అని ఫ్రెండ్స్ ని, బంధువులని అడిగితే ఒక్కోకొరు ఒక్కొక్క మాట చెప్తుంటారు.ఎలాంటి వాళ్ళనైనా అందంగా చూపించేది బట్టలు.. అలాంటి అందాన్ని మరింత అందంగా చేసే వస్త్రాలు ఈ ఎగ్జైబిషన్ లో ఉన్నాయట.. ఎగ్జిబిషన్ ఎక్కడో తెలుసా.... భారతీయ చేనేత వస్త్రాలు వివిధ రాష్ట్రాల సంప్రదాయ సిల్క్డిజైన్స్. హనుమకొండ కేంద్రంలోని ప్రైవేట్ హోటల్లో ఈ చేనేత హస్త కళలను ప్రదర్శిస్తున్నారు.

కోవిడ్ తో నష్టపోయిన వీవర్స్, ఆర్టిజన్స్ కు చేయూతను అందించాలని హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ , ఏపీ, మహారాష్ట్రతో పాటు దేశంలో ఉన్న పలు రాష్ట్రాల వస్త్రాలను ఆర్గనైజర్స్ ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. రాబోయే పెళ్లిళ్లు, సీజన్స్ పండుగలకు అనుగుణంగా వెరైటీ డిజైన్స్ దర్శిస్తున్నట్టు తెలిపారు. కొద్ది రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.

హనుమకొండ కేంద్రంలో దేశవ్యాప్త వస్త్రకళ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి చోట నిర్వహించే ఈ ప్రదర్శనను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ , వరంగల్ మరియు ఇతర నగరాల్లో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భీమవరం, ఒంగోలు గుంటూరు ప్రాంతాల్లో ఈ ప్రదర్శనని నిర్వహించారు. ఆడవారికి కావాల్సిన పెళ్లి వస్త్రాలు డిజైనర్ సారీస్, డిజైనర్ కుర్తాస్ మామూలు షాపుల్లో కన్నా ఎక్కువ వెరైటీలు ఇక్కడ లభిస్తాయి.

దేశంలో అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వస్త్రాలు వస్తాయి. సుమారు 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో కలకత్తా, ముంబై, ఢిల్లీ హర్యానా లాంటి ప్రదేశాల నుండి సాంప్రదాయ వస్త్రాలు లభిస్తాయి. తమ వద్ద అనేక రకమైన వెరైటీ ఉంటాయి కాబట్టే ఎక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించిన మహిళలతో పాటు చిన్నారులకు కావలసినవి కూడా లభిస్తాయి.అందుకే తాము ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా విజయవంతంగా నడుస్తుందని.. బయట దొరకని విధంగా చేనేత వస్త్రాలు ఉంచడం వీరి ప్రత్యేకత. నారాయణపేట, కంచి, ధర్మవరం, భీమవరం పట్టుకు సంబంధించినవి ప్రత్యేకంగా లభిస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా నాణ్యత పరమైన వస్త్రాలతో నరసమైన ధరలకు వినియోగదారులకు అందించడమే తమ ప్రత్యేకత అంటున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు సునీత.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు