Santhosh, News 18, Warangal
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేటు పీఏ శివపై అత్యాచారయత్నం కింద కేసు నమోదైంది. హన్మకొండ పోలీస్ స్టేషన్లో శివ, ఆయన స్నేహితుడు, హాస్టల్ నిర్వాహాకురాలిపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు అట్రాసిటీతో పాటు లైంగిక దాడి యత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసునుహన్మకొండ ఏసీపీ కిరణ్ స్వయంగా దర్యాప్తు చేయనున్నారు. పోలీస్ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(23) హన్మకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది.
ఈ క్రమంలోనే విద్యార్థినికి ఏవో మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే పీఏ శివ, అతడి స్నేహితుడి వద్దకు హాస్టల్ నిర్వాహాకురాలు తీసుకెళ్లగా వారు లైంగిక దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ సదరు యువతి హన్మకొండ పోలీసులను బుధవారం ఆశ్రయించగా ప్రాథమిక వివరాలను సేకరించి నిర్ధారించుకున్నాక గురువారం కేసు నమోదైనట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువతి ఫిర్యాదు మేరకు 527/2022, SC/ST, 506, 376, 109, ఆక్ట్-2015 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో శివతో పాటు అతడి స్నేహితుడిని, హాస్టల్ నిర్వాహాకురాలిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి నిందితుల వివరాలు బయటకు రాకుండా పోలీసు శాఖ గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా సాధ్యం పడలేదని స్పష్టమవుతోంది. యువతిని సహజంగానే కేసు పెట్టకుండా ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Telangana, Warangal