హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనేమో..మరీ ఇంత ఘోరమా?

Warangal: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనేమో..మరీ ఇంత ఘోరమా?

X
వరంగల్

వరంగల్ ఎంజీఎం

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా దాట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వందే భారత్ రైలు ఢీకొని మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తీసుకువచ్చారు. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి ఉన్నవారిని చూసి జాడి పడాల్సింది పోయి మార్చరీ గదిలో కొంతమంది సిబ్బంది పోస్టుమార్టం కొరకు డబ్బులు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(సంతోష్, న్యూస్ 18 తెలుగు, వరంగల్ జిల్లా)

మనిషి పుట్టాలన్నా లంచం, ఆసుపత్రిలో మంచి వైద్యం అందించాలన్న లంచం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పనిచేయాలన్నా లంచం, చివరకు మనిషి చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేయడానికి కూడా లంచం. అలా సాటి మనిషికి సహాయం చేయడానికి కూడా నోచుకోని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఆస్పత్రుల్లో ప్రాణం ఉండగానే రక్తాన్ని పీల్చేవార్లు కొందరైతే మరణించాక శవాలపై డబ్బులు ఏరుకునేవారు మరికొందరు. వీరికి మనిషైనా, శవమైన ఒకటే అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం మార్చరిలో జరుగుతున్న యదార్థ ఘటనపై18 ప్రత్యేక కథనం.

Vijayawada: తీర్థయాత్రలకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే.

ఉమ్మడి వరంగల్ జిల్లా దాట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వందే భారత్ రైలు ఢీకొని మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తీసుకువచ్చారు. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి ఉన్నవారిని చూసి జాడి పడాల్సింది పోయి మార్చరీ గదిలో కొంతమంది సిబ్బంది పోస్టుమార్టం కొరకు డబ్బులు డిమాండ్ చేశారు. మార్చురీ గదిలో గత 25 ఏళ్ల నుండి పనిచేస్తున్న మృతదేహాలను ఫోటోలు తీసే ఓ ప్రైవేటు ఫోటోగ్రాఫర్, జీఆర్పీ కానిస్టేబుల్, పోస్టుమార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. రక్త పిశాచిలా ఆ కుటుంబాన్ని పీక్కుతిన్నారు. పొట్టకూటికోసం కూలి పని చేసుకునే బ్రతికే కుటుంబం అని చెప్పినా వినకుండా 15 వేల రూపాయలు డిమాండ్ చేశారు. తమ వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా కనికరించలేదు. చివరకు చేసేదేమీ లేక మృతుడి కుటుంబం అడిగిన డబ్బులుఇచ్చేసారట. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఈ సంఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది.

Tarakaratna Health Updates: తారకరత్నను విదేశాలకు తరలిస్తారా ?.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

ఈ వీడియోలో చూసినట్లయితే.. మార్చురీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది బాధితుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులను లెక్కిస్తూ కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వాలని చెబుతున్నట్టుగా వీడియోలో రికార్డు అయ్యింది. ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిమిత్తం ఎవరిని తీసుకువచ్చినా అక్కడ సిబ్బందికి పండగే. ఇష్టరాజ్యంగా వ్యవహరించే వీరి తీరును అడిగేది ఎవరు అంటున్నారు ప్రజలు? ఎంజీఎం సూపరిండెంట్ చంద్రశేఖర్ మార్చరీలో జరిగిన పరిస్థితులను తెలుసుకొని ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ ను ఎంజిఎం నుండి తీసివేశారు.

అంతేకాకుండా రైల్వే జిఆర్పి పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని లేఖను కూడా రాశారు. ఇందులో ఫోరెన్సిక్ డాక్టర్ల చేతివాటంపైనా విచారణ చేపట్టడమే కాకుండా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ తగు సూచనల బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తానికైతే ఎంజీఎం మార్చరీలో శవాలపై డబ్బులు ఏరుకునే రాబందుల నుండి ఎంజీఎం మార్చురీకి విముక్తి కలిగినందుకు స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు