హోమ్ /వార్తలు /తెలంగాణ /

Medaram Mini Jatara: ఇవాల్టి నుంచి మేడారం మినీ జాతర.. భారీగా తరలివస్తున్నా భక్తులు!

Medaram Mini Jatara: ఇవాల్టి నుంచి మేడారం మినీ జాతర.. భారీగా తరలివస్తున్నా భక్తులు!

జాతరకోచ్చే భక్తులు మంచినీళ్లు, మరుగుదోడ్ల కోసం ఇబ్బంది పడకుండా కూడా ఏర్పాట్లు చేశారు. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

వరంగల్ మేడారం జాతర సందడి మొదలైంది. మండ మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  రెండు రోజుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల దర్శనానికి తరలివస్తున్నారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.

మరోవైపు అధికారలుు జాతర కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జాతరకు భారీగా నిధులు విడుదల చేసింది. మేడారం మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మండ మెలిగే పండుగ పేరుతో చిన్న జాతర నిర్వహిస్తారు. పెద్ద జాతరలో దర్శనానికి రాలేని భక్తులు.. ఈ జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిఅన్ని ఏర్పాట్లు చేసింది.

మరోవైపు  జాతరకోచ్చే భక్తులు మంచినీళ్లు, మరుగుదోడ్ల కోసం ఇబ్బంది పడకుండా కూడా ఏర్పాట్లు చేశారు. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. జంపన్న వాగుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు, జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల సౌకర్యాలు కల్పించారు. పారిశుద్ధ్య పనుల కోసం 300 మంది కార్మికులను నియమించారు.

మేడారం మినీ జాతరకు  నాలుగు నుంచి ఐదున్నర లక్షల మంది భక్తులు  దర్శనానికి వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మేడారానికి వచ్చే భక్తుల కోసం హనుమకొండ, వరంగల్ , ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

First published:

Tags: Local News, Medaram jatara, Warangal

ఉత్తమ కథలు