హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: కేఎంసీ వైద్యుల నిర్లక్ష్యం.. పగబట్టి ఆపరేషన్ నిరాకరణ

Warangal: కేఎంసీ వైద్యుల నిర్లక్ష్యం.. పగబట్టి ఆపరేషన్ నిరాకరణ

రోగిపట్ల అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్లు

రోగిపట్ల అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్లు

Warangal: ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వైద్యులు సేవలదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఓ బాధితుడుఆవేదన వ్యక్తం చేసాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వైద్యులు సేవలదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఓ బాధితుడుఆవేదన వ్యక్తం చేసాడు. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. దామెర అశోక్‌ తన భార్య జయకు నెల క్రితం కడుపులో నొప్పి రావడంతో కేఎంసీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు . ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తామని అడ్మిట్‌ చేశారు.

దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్న వారికి శుక్రవారం ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు అశోక్‌తో చెప్పారు. గురువారం సాయంత్రం బ్లడ్‌ రిజర్వ్‌ చేసి ఉంచాలని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే గురువారం రాత్రే బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు అశోక్‌కు బ్లడ్‌ అందించారు. తెచ్చిన బ్లడ్ ప్యాకెట్ ను కేఎంసీలోని డాక్టర్లకు చూపించగా ఇప్పుడు అవసరం లేదంటూ తిప్పిపంపారు. అయితే బ్లడ్‌ బ్యాంకులో ఆ రక్తం తీసుకోవడానికి నిరాకరించారు. ఐతే ఓ సెక్యూరిటీ గార్డు అశోక్‌ భార్య కేస్‌ షీటు తీసుకుని మాయమయ్యాడు.

ఏం చేయాలో తోచని అశోక్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం పోలీసులకు వివరించాడు. స్పందించిన పోలీసులు అశోక్‌తో నేరుగా కాకతీయ మెడికల్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి విషయం సర్దుమణిగేలా చేశారు. ఉదయాన్నే ఆపరేషన్‌ చేసేందుకు అశోక్‌ భార్య జయను సిద్ధం చేశారు. కానీ ఆ తర్వాత కేఎంసీ వైద్యులు జయకు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. అశోక్‌ ని పిలిచి రాత్రి జరిగిన సంఘటనపై ఆరా తీశారు.

మాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ వారితోనే ఆపరేషన్‌ చేయించుకోమంటూ వెటకారంగా మాట్లాడారు. రోగిని ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద కూర్చోబెట్టి ఆపరేషన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో బాధితుడు అశోక్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదీ వరంగల్‌‌లోని కేఎంసీ ఆస్పత్రిలో వైద్యుల తీరు. శుక్రవారం సాయంత్రం నుంచి రోగిని ఏం తినకూడదు చెప్పి.. ఆపరేషన్ కి సిద్ధం చేసి గంటలు గడుస్తున్నా శనివారం ఉదయం వరకు పట్టించుకోలేదు. పగబట్టి రోగిని ఇబ్బందులకు గురిచేస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మరీ.. కేఎంసీ వైద్యుల అహంకారానికి కారణమేంటో గానీ, రోగులతో ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని రోగులు మండిపడుతున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు