హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీనియర్ సైఫ్ అరెస్ట్ ..ఏమని వేధించాడో తెలుసా..?

Crime News: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీనియర్ సైఫ్ అరెస్ట్ ..ఏమని వేధించాడో తెలుసా..?

preethi,saif(file photos)

preethi,saif(file photos)

Raging: వరంగల్‌లో మెడికల్ స్టూడెంట్ అత్యహత్యాయత్నం కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేఎంసీలో అనస్థీషియా విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న పీజీ విద్యార్ధినిని ప్రీతిని అవమానించడమే కాకుండా నలుగురిలో అవహేళన చేయడం వల్లే ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు తేల్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ స్టూడెంట్ వేధింపుల వ్యవహారంలో నిందితుడిగా పేర్కొంటున్న వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌(Warangal)లోని కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో పొస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్దిని ప్రీతి(Preethi) ఇంకా చావు, బ్రతకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రీతి తండ్రితో పాటు రాజకీయ పార్టీల నిరసనలు, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపధ్యంలో కేసులో విచారణ జరిపిన పోలీసులు మహ్మద్ సైఫ్ (Mohammed Saif)అనే సీనియర్‌ని అరెస్ట్ చేశారు. అతను తరచూ ప్రీతిని అవమానించడం, చులకన చేసి మాట్లాడటం వల్లే రెండ్రోజుల క్రితం ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

అరచాకవాది అరెస్ట్ ..

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతి వేధింపుల కేసులో మహ్మద్ సైఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. కేఎంసీలో అనస్థీషియా విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని సీనియర్ మహ్మద్ సైఫ్ పదే పదే కేస్ షీట్ విషయంలో నీకు బుర్రలేదంటూ అవమానించడం, వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టి అవమానించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. సున్నిత మనస్కురాలైన ప్రీతి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా వాట్సాప్‌ మెసేజ్‌ని తన స్నేహితులకు పెట్టినట్లుగా వరంగల్ సీపీ తెలిపారు.

భరించలేని టార్చర్ ..

తనను పదే పదే వేధిస్తున్న సైఫ్‌ను ఈనెల 18వ తేదిన ప్రీతి నిలదీసింది. తన తప్పు ఏదైనా ఉంటే హెచ్‌ఓడీలతో చర్చించాలి తప్ప ..గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై సీనియర్‌గా ఉన్న సైఫ్ తనపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నాడని ఫ్రెండ్స్‌తో తన బాధను షేర్ చేసుకుందని సీపీ రంగనాథ్ మీడియాతో చెప్పారు. ఒక వ్యక్తి అమానంగా ఫీలయ్యేలా ప్రవర్తించడం ర్యాగింగ్‌ కిందకే వస్తుందని చెప్పారు. అందులో సైఫ్‌ని శుక్రవారం అరెస్ట్ చేశామని ..విచారిస్తున్నామన్నారు. ఈ కేసులో అన్నీ కోణాల్లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు సీపీ రంగనాథ్.

Death Certificate: ఇక్కడింతే.. మరణ ధృవీకరణ పత్రం కావాలంటే రూ.2 వేలు ఇచ్చుకోవాల్సిందే..!

అవమానాలు, అవహేళన తాళలేకే ..

ప్రస్తుతం హైదరాబాద్‌ నిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ప్రీతిని తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు గవర్నర్. అలాగే ప్రీతి తల్లిదండ్రుల్ని కలిసి ధైర్యం చెప్పారు గవర్నర్. ఒక పీడీ మెడికల్ స్టూడెంట్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉండటం దురదృష్టకరమన్నారు.నిమ్స్ వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇక ఉన్నత విద్యాలయాల్లో పని ఒత్తిడి, అధ్యాయనాల విషయంలో ఒత్తిడిపై విచారణ జరిపించాలని ట్వీట్ చేశారు.

కొనసాగుతున్న విచారణ..

ప్రీతి హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉండటంతో కేఎంసీ దగ్గర విద్యార్ధి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టే ఉద్దేశం ఉండటంతో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అంతే కాదు ఈకేసులో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఆ నివేదికను వైద్య విద్య డైరెక్టర్‌కు అందజేయనున్నారు.

First published:

Tags: Telangana crime news, Warangal

ఉత్తమ కథలు