వరంగల్(Warangal) జిల్లాలో మెడికల్ స్టూడెంట్ అత్యహత్యాయత్నం కలకలం రేపుతోంది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో అనస్థీషియా విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది విద్యార్ధిని ప్రీతి. గతేడాది నవంబర్ నుంచి కాలేజీలో చదువుతున్న ఓ సీనియర్ విద్యార్ధి వేధిస్తూ ఉండటంతో ఆమె మంగళవారం(Tuesday) నైట్ డ్యూటీలో ఉండగా హానికరమైన ఇంజెక్షన్ వేసుకుంది. డ్యూటీ ముగిసిన తర్వాత బుధవారం ఉదయం 6.30గంటలకు మెడికో అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి సీపీఆర్ (CPR)చేసారు. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో వెంటనే హైదరాబాద్(Hyderabad) నిమ్స్(Nims)లో చేర్పించారు. ఇక్కడి వైద్యులు కూడా ఆమె హెల్త్ కండీషన్ సీరియస్‌గానే ఉందని తెలిపారు.
మెడికో సూసైడ్ అటెంప్ట్..
వరంగల్ కేఎంసీలో పోస్ట్‌గ్రాడ్యూయేషన్(ఎండీ)చదువుతున్న ప్రీతిని ఓ సీనియర్ వేధిస్తుండగా కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోకపోవడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వేధింపులు మరింత పెరగడంతో భరించలేక మంగళవారం రాత్రి ప్రాణాలు తీసుకునేందుకు విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుందని తెలుస్తోంది. మెడికో తండ్రి వరంగల్‌లోని ఆర్పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు.
ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు..
మెడికో ప్రీతి ఆత్మహత్యకు వేధింపులే కారణని బాధితురాలి తండ్రి నరేంద్ర మండిపడుతున్నారు. సీనియర్ స్టూడెంట్‌పై కాలేజీ ప్రిన్సిపాల్, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో తన కుమార్తె తన తోటి విద్యార్థుల మద్దతు కోరిందని వారు కూడా ఇదే కాలేజీలో మరో రెండేళ్లు చదవాలని గొడవలు ఎందుకని చెప్పి వెనక్కి తగ్గడం వల్లే ఇంత దారుణం జరిగిందంటున్నారు. తన బిడ్డను వేధింపులకు గురి చేసిన విద్యార్ధిపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర డిమాండ్ చేశారు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్..
అయితే పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేస్తున్న మెడికోను వేధింపులకు గురి చేశారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీనియర్ స్టూడెంట్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసినట్లుగా రుజువైతే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసులు తెలిపారు. కేఎంసీ అధికారులు మాత్రం తలనొప్పిగా ఉండటం వల్లే ప్రీతి ఇంజెక్షన్ తీసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీతి నిమ్స్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్‌మెంట్ పొందుతోంది. కోమాలో ఉన్న ప్రీతి హెల్త్ కండీషన్‌పై మరో 24గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచారు డాక్టర్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News, Warangal