హోమ్ /వార్తలు /తెలంగాణ /

గొర్రెల పెంపకాన్ని చీప్ గా చూడొద్దు.. ఇలా చేస్తే లాభాల పంటే

గొర్రెల పెంపకాన్ని చీప్ గా చూడొద్దు.. ఇలా చేస్తే లాభాల పంటే

X
గొర్రెల

గొర్రెల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న వరంగల్ రైతు

చాలా మందికి తెలియదు కానీ.. గొర్రెల పెంపకం చాలా లాభదాయకం. జీవాలకు సీజన్లలో వచ్చే రోగాలు.. వాటికి ఆహారం సమస్యలను అధిగమిస్తే గొర్రెల పెంపకం చాలా లాభదాయకంగా చెప్పుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Santosh, News18, Warangal

చాలా మందికి తెలియదు కానీ.. గొర్రెల పెంపకం చాలా లాభదాయకం. జీవాలకు సీజన్లలో వచ్చే రోగాలు.. వాటికి ఆహారం సమస్యలను అధిగమిస్తే గొర్రెల పెంపకం చాలా లాభదాయకంగా చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణే వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవల మాంసానికి పెరుగుతున్న గిరాకీతో రైతులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు సైతం గొర్రెల ఫారంలపై దృష్టి సారిస్తున్నారు. డైరీ ఫారం ఏర్పాటుకైతే పని వారి అవసరం ఎక్కువ, పెట్టుబడులు అధికమే. అదే గొర్రెల పెంపకం అయితే అతి తక్కువ నిర్వహణ, తక్కువ పెట్టుబడితోనే చేపట్టవచ్చు. పనివారి లభ్యత గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. చుట్టుపక్కల పొలాలు, అడవులు, కొండలు ఉంటే పచ్చిక కోసం రోజు కొంతసేపు బయట గొర్రెలను తిప్పి మేపి మిగతా సమయం ఫెన్సింగ్ లోపల షెడ్డులో లేదా ఫెన్సింగ్ లోపల పచ్చిక పెంచి మేపుకోవచ్చు. ఇలా షెడ్డు లోపల ఉంచి పెంచే పద్ధతిని సాంద్ర పద్ధతి అంటారు.

సాధారణంగా గొర్రెలను 20 కిలోల వరకు బరువు వచ్చిన తర్వాత లేదా 9 నుంచి 10 నెలల వయసులో మాంసం కోసం అమ్మకం చేస్తుంటారు. ఆడ గొర్రెలను కొన్ని బ్రీడింగ్ కోసం మందలో కలిపి.. అదనంగా ఉన్న ఆడ, మగ గొర్రెలను అమ్మకం చేస్తూ ఉంటారు. అయితే, గొర్రెల ఫారంలను వాణిజ్యపరంగా నిర్వహణ చేయాలంటే ఎలాంటి గొర్రెలను ఎంచుకోవాలి? షెడ్డు లోపల ఎలా ఉండాలి..? ప్రాథమిక పెట్టుబడి ఎంత అవుతుంది? నిర్వహణ వ్యయం ఎంత అవుతుంది? వ్యాధుల నివారణ ఎలా? ఎప్పటినుంచి లాభాలను చూడవచ్చు? అన్న సందేహాలు సహజం. ఇలాంటి వారు లాభాల బాటలో సాగుతున్న ఒక ఫారాన్ని చూడాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడతారు. అలాంటి వారికోసం విజయవంతంగా నడుస్తున్న గొర్రెల ఫారంను చూపిస్తుంది న్యూస్ 18.

ఇది చదవండి: రామప్ప టూరిస్ట్ గైడ్స్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వరంగల్ (Waranal) శివారు ప్రాంతం ఖిల్లా వరంగల్ పడమట కోటకు చెందిన దుగ్గిరాల లక్ష్మణ్ గత నాలుగు సంవత్సరాలుగా గొర్రెల పెంపకం చేస్తున్నాడు. వీరు దేశి గొర్రెల పెంపు సాగు మాత్రమే చేస్తారు. ఈ గొర్రెలను కరీంనగర్ జిల్లా (Karimnagari District) గంగాధర నుంచి ఖమ్మం జిల్లా నుంచి కొనుగోలు చేశారు. ఒక్కసారి ఒక్కసారి 50 గొర్రెలను కొనుగోలు చేస్తారు. ఒక్కో గొర్రెకు రూ.6000 నుంచి రూ.8 వేల వరకు కొనుగోలు చేస్తామన్నారు. వాటిని వారు ఏర్పాటు చేసుకున్న ఫారంలో మేపి కొద్ది రోజులు ఉంచి, లాభదాయకమైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్మేస్తామన్నారు.

దేశి గొర్రెలను మాత్రమే పెంపకం చేయడానికి కారణమేంటంటే దేశి గొర్రెల మాంసంలో విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే హైబ్రిడ్ గొర్రెల్లో ఎలాంటి విటమిన్లు ఉండవు. కాబట్టి దేశి గొర్రెలను పెంపకం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో కొనేవారు కూడా హైబ్రిడ్ గొర్రెల కంటే దేశి గొర్రెల మాంసాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే ఈ దేశ గొర్రెలు పెంపకాన్ని చేస్తున్నానని లక్ష్మణ్ చెప్పాడు. ప్రస్తుతానికైతే గొర్రెల పెంపకం లాభదాయకంగానే ఉంటుందని రైతు చెప్పాడు.

First published:

Tags: Local News, Telangana, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు